RRR at Japan: జపాన్లో ఆర్ఆర్ఆర్ టీమ్.. రచ్చ చేస్తున్న రామ్ చరణ్-ఎన్టీఆర్-రాజమౌళి(ఫోటోలు)

RRR Promotions  at Japan: జపాన్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 20, 2022, 12:39 PM IST
RRR at Japan: జపాన్లో ఆర్ఆర్ఆర్ టీమ్.. రచ్చ చేస్తున్న రామ్ చరణ్-ఎన్టీఆర్-రాజమౌళి(ఫోటోలు)

RRR Promotions in Full Swing at Japan: దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సహా దక్షిణాది భాషలోనే కాక హిందీ అలాగే కొన్ని విదేశీ భాషల్లో కూడా విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని జపాన్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్.

 

జపాన్లో ఈ 21వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి జపాన్ చేరుకున్నారు. మరోపక్క రాజమౌళి కూడా జపాన్ కి చేరుకున్నారు.

ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జపాన్లో రాజమౌళి బాహుబలి సినిమాకి మంచి క్రేజ్ లభించిన నేపథ్యంలో ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ప్రమోషన్స్ సినిమాకు మరింత బలం చేకూరుస్తాయని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని డివివి దానయ్య సుమారు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించింది. చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రాజమౌళి సినిమా ని రూపొందించారు.

Also Read: Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?

Also Read: Rakul Preet Singh Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. జిగేల్ మనిపిస్తోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News