RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో పోస్టర్.. రామ్ చరణ్ గెటప్ పోలా అదిరిపోలా!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 05:58 PM IST
  • ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో పోస్టర్
  • రామ్ చరణ్ గెటప్ పోలా అదిరిపోలా
  • 9 గంటలకు ఇంకో అప్‌డేట్
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో పోస్టర్.. రామ్ చరణ్ గెటప్ పోలా అదిరిపోలా!!

RRR Movie Team release Ram Charan's New Poster as Alluri Sitarama Raju: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా కోసం యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల అవుతోంది. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పోస్టర్, అప్‌డేట్ వదిలింది చిత్రబృందం. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబందించిన ఓ పోస్టర్‌ (Poster)ను చిత్రబృందం తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. పోస్టర్‌లో బాణం పట్టుకున్న చరణ్. ఆవేశంతో పరుగెత్తుతున్నాడు. ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. ఫొటోపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. చరణ్ గెటప్ పోలా అదిరిపోలా అంటూ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫొటోతో పాటు మరో అప్‌డేట్ కూడా వదిలింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్. #RiseOfRam ఫైరీ బీట్స్ ఈరోజు రాత్రి 9 గంటలకు రిలీజ్ అవుతుందని పేర్కొంది. దాంతో చరణ్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. 

Also Read: Samantha Ruth Prabhu: అందమైన అమ్మాయిగా నటించి అలసిపోయా.. ఇక అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నా!

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కలిసి వరుసగా టాక్ షో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt) నటిస్తుండగా.. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగే పోరాట యోధుడిగా స్టార్ హీరో అజయ్ దేవగన్ కనిపించనున్నారు. బ్రిటీష్ యువరాణిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ కనిపిస్తుండగా.. బ్రిటీష్ అధికారి పాత్రలో రాయ్ స్టవ్ సన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ శరన్ (Shriya Saran) కూడా ప్రత్యేక పాత్రలు చేశారు. 

Also Read: Viral Video: ఈ పెళ్లి కూతురికి పానీ పూరి ఉంటే చాలు.. ఇంకేమీ వద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News