RRR review: ఆర్​ఆర్​ఆర్​ ఓవర్​సిస్​ రివ్యూ వచ్చేసింది- మూవీ రికార్డులు సృష్టిస్తుందా?

RRR review: ఆర్​ఆర్​ఆర్​ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్​, సినీ క్రిటిక్​ ఉమెయిర్ సందు ఆర్​ఆర్​ఆర్​ రివ్యూ ఇచ్చేశారు. మూవీ గురించి, ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​ల నటన గురించి ఆయన ఆయన మాటల్లోనే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 08:26 PM IST
  • ఆర్​ఆర్​ఆర్​ ఓవర్​సిస్​ రివ్యూ
  • సినిమా బ్లాక్ బాస్టర్​ అంటూన్న క్రిటిక్స్​
  • మరికొన్ని గంటల్లో విడుదలవనున్న మూవీ
RRR review: ఆర్​ఆర్​ఆర్​ ఓవర్​సిస్​ రివ్యూ వచ్చేసింది- మూవీ రికార్డులు సృష్టిస్తుందా?

RRR review: సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టికెట్లు దొరికిన వాళ్లు.. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంత మందేమో బెనిఫిట్​ షో మొదలుకుని.. రాత్రి సెకండ్​ షో వరకు ఏదైనా చూడాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​లు హీరోలుగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ఆలియా భట్​ హీరోయిన్​గా నటించగా.. అజయ్​ దేవ్​గన్​ గెస్ట్ రోల్​ చేశారు. ఇదిలా ఉండగా.. సినిమాను ఇప్పటికే చూసేసిన.. ఉమెయిర్​ సందు 'ఆర్​ఆర్​ఆర్​' రివ్యూ ఇచ్చేశారు. సినిమా ఎలా ఉందో చెబుతూ ట్వీట్ చేశారు.

ఎవరు ఈ ఉమెయిర్ సందు?

ఉమెయిర్​ సందు యూకే, యూఏఈ సెన్సార్​ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అంతే కాదు యూఎస్​ఏలో భారతీయ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్​గా కూడా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఆయన సినిమా క్రిటిక్​ కూడా. అందుకే ఆయన రివ్యూపై ఎంతో మంది ఆసక్తికనబరుస్తుంటారు.

ఉమెయిర్ సందు రివ్యూ ప్రకారం ఆర్​ఆర్​ఆర్​ ఎలా ఉంది?

ఉమెయిర్​ సందూ తాను.. ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​లకు పెద్ద ఫ్యాన్ అని చెబుతూ.. ఇవాళ సాయంత్రమే సినిమా చూసినట్లు ట్వీట్ చేశారు. 2022లో చూసిన పెప్ద మూవీ ఇదేనని కూడా చెప్పుకొచ్చారు.

సినిమా స్టోరీని రివీల్ చేయకుండా.. క్లైమాక్స్​ సినిమా ప్రేక్షకులను సర్​ప్రైజ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాలో ద్వితీయార్థం అద్భుతంగా ఉందంటూ ట్వీట్టర్​లో పేర్కొన్నారు.

ఇక ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​ల యాక్టింగ్ గురించి కూడా ప్రస్తావించారు ఉమెయిర్ సందూ. ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయం సాధించిందని వివరించారు. ఇక ఈ మూవీతో ఎన్​టీఆర్​కు జాతీయ అవార్డు రావడం పక్కా అని జోస్యం కూడా చెప్పారు. రామ్​ చరణ్​ టెర్రిఫిక్ యాక్టింగ్ చేశారంటూ చెప్పారు.

ఇక ఈ మూవీలో గెస్ట్ రోల్ చేసిన అజయ్​ దేవ్​గన్​ కనిపించింది కొద్దిసేపే అయినా ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశారన్నారు ఉమెయిర్ సందు. ఇక ఆలియా భట్​ తన పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పారు. ఇక ఈ మూవీకి తాను 5 స్టార్ రేటింగ్​ కూడా ఇస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

మొత్తం మీద ఈ మూవీ భారతీయుడు గర్వించేలా ఉంటుందని చెప్పారు. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమన్నారు. యూఎస్​లో గతంలో ఎన్నడూ చూడని ఓపెనింగ్స్ సాధించిందంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

Also read: RRR rajamouli remuneration: ఆర్​ఆర్​ఆర్​ కోసం రాజమౌళి ఎంత తీసుకున్నారంటే?

Also read: RRR Ticket Price: రేపే ఆర్​ఆర్​ఆర్ విడుదల​- ఒక్కో టికెట్ రేటు ఎంతో తెలుస్తే షాకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News