RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'కొమురం భీముడో' పాట కాపీనా..? ఇంతకీ ఒరిజనల్ ఏంటి?

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' టీమ్.. 'రివోల్డ్ ఆఫ్ భీమ్' సాంగ్​ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాట కాపీ అంటూ..నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 09:50 PM IST
RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'కొమురం భీముడో' పాట కాపీనా..? ఇంతకీ ఒరిజనల్ ఏంటి?

RRR Movie: పాన్‌ ఇండియా చిత్రం ''ఆర్‌ఆర్‌ఆర్‌'' నుంచి 'కొమురం భీముడో..కొమురం భీముడో' సాంగ్ (komaram bheemudo telugu Lyrical Song)  శుక్రవారం విడుదలైంది. గోండు బెబ్బులి కొమురం భీమ్‌ ధైర్యసాహసాలను చాటిచెప్తూ అద్భుతమైన లిరిక్స్‌ అందించాడు సుద్దాల అశోక్‌ తేజ. సింగర్‌ కాలభైరవ (Kaala Bhairava) తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ సాంగ్ ఓ పాత పాటకు కాపీ అని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది అచ్చం గద్దర్ పాడిన 'మదనా సుందరీ..మదనా సుందరీ' పాట లాగే ఉందని ఆరోపణలు చేస్తున్నారు. 'కొమురం భీముడో..' అని వచ్చేటప్పుడు అదే సాంగ్ గుర్తొస్తుందంటున్నారు. 

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ (Ram charan), కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr Ntr) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR movie). రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆలియాభట్‌ (Alia Bhatt), ఒలివియా మోరిస్‌ హీరోయిన్లు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ అవుతుంది. డిసెంబర్‌‌ 9న రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ట్రైలర్‌‌కు విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌‌ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది ఆర్ఆర్ఆర్‌ చిత్ర బృందం. 

Also Read: RRR Movie Komuram Bheemudo song : ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో సాంగ్‌ వచ్చేసింది! ఎమోషన్స్ ఇరగదీసిన కాల భైరవ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News