RRR movie shooting: క్వారంటైన్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆడియెన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) మొదటిది అని చెప్పొచ్చు. రాజమౌళి ( SS Rajamouli ) డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ( Jr Ntr, Ram Charan ) మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా లాక్ డౌన్ తరువాత తిరిగి అక్టోబర్ చివరి నుండి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

Last Updated : Oct 4, 2020, 03:01 PM IST
RRR movie shooting: క్వారంటైన్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆడియెన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) మొదటిది అని చెప్పొచ్చు. అన్‌లాక్ ప్రక్రియ మొదలై షూటింగ్స్‌కి దశలవారీగా అనుమతి లభించిన తరువాత మెల్లిమెల్లిగా సినిమాల షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. రాజమౌళి ( SS Rajamouli ) డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ( Jr Ntr, Ram Charan ) మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా లాక్ డౌన్ తరువాత తిరిగి అక్టోబర్ చివరి నుండి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. Also read : Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్

తాజా సమాచారం ప్రకారం, కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా షూటింగ్ ప్రారంభించిన తరువాత ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండ ఆర్ఆర్ఆర్ సినిమా నటీనటులును, సిబ్బందిని మొత్తం అక్టోబర్ 10 నుండి 14 రోజుల పాటు క్వారంటైన్ కావాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యే వరకు వారంతా స్టార్ హోటళ్లలో ఐసోలేట్ ( Isolate ) అవ్వనున్నారని టాలీవుడ్ టాక్. షూటింగ్ ప్రారంభించిన తరువాత ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకుని, వాటిని అధిగమించడానికి వీలుగా షూటింగ్ కంటే ముందుగా ఓ శాంపుల్ షూటింగ్ కూడా నిర్వహించనున్నారని సమాచారం. Also read : Expiry Date Trailer: సస్పెన్స్‌కి గురిచేస్తున్న ఎక్స్‌పైరి డేట్ ట్రైలర్

Jr-Ntr-Ram-Charan-in-RRR-movie

అలాగే షూటింగ్‌కి సంబంధించిన అన్ని వస్తువులను, పరికరాలు, పరిసరాలను శానిటైజ్ ( Sanitization ) చేయనున్నారు. అంతేకాకుండా నటీనటులకి, సిబ్బందికి షూటింగ్‌కి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేయనున్నారు.

రూ. 400 కోట్ల ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డివివి దానయ్య ( DVV Danayya ) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, అలియా భట్ ( Ajay Devgn, Alia bhatt ) వంటి బాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నారు. Also read : Samantha as Pakistan terrorist: పాకిస్థాన్ టెర్రరిస్టుగా సమంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News