RRR Japan Day 1 Collections: దారుణంగా జపాన్ 'ఆర్ఆర్ఆర్' ఓపెనింగ్ కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వసూలైందంటే?

RRR opening Collections at Japan: చాలా కాలం తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది, ఇక ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 22, 2022, 08:35 PM IST
  • జపాన్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్
  • పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన టీమ్
  • అయినా కలెక్షన్స్ షాక్
RRR Japan Day 1 Collections: దారుణంగా జపాన్ 'ఆర్ఆర్ఆర్' ఓపెనింగ్ కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వసూలైందంటే?

RRR Disappointing opening at Japan Box Office: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కాకుండా కొన్ని విదేశీ భాషలలో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు ఇండియాలోనే కాకుండా అనేక భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే జపాన్లో మాత్రం తెలుగు సహా తమిళ సినిమాలకి మంచి మార్కెట్ ఉండడంతో నేరుగా రిలీజ్ చేయాలని ఇప్పటివరకు రిలీజ్ ఆపారు.

ఇక అక్టోబర్ 21వ తేదీ శుక్రవారం నాడు ఈ ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ భార్యలతో కలిసి జపాన్ వెళ్లడమే కాక భారీ ఎత్తున ఖర్చు కూడా పెట్టారు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రమోషన్స్ నిర్వహించి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతా చేస్తే ఈ సినిమా మొదటి రోజు కేవలం కోటి రూపాయల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

శుక్రవారం నాడు కేవలం కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేస్తే ఈ సినిమా వీకెండ్ లో మరింత పుంజుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు రాజమౌళి సహా మిగతా టీం వెళ్లడానికి భారీగానే ఖర్చు పెట్టారని, అందుకే ఈ సినిమా జపాన్లో 30 కోట్లకు పైగా వసూలు చేస్తే తప్ప ఈ రిలీజ్ కి అర్థం ఉండదని అంటున్నారు. అంతేకాక గతంలో జపాన్లో రోబో, 2.0, బాహుబలి, దంగల్ వంటి సినిమాలకు మంచి వసూళ్ల లభించాయి.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కొంతమంది విదేశీ నటీనటులు ఉన్నా సరే ఈ సినిమా కనుక కలెక్షన్స్ రాబట్టకపోతే రాజమౌళి మార్కెట్ కు అక్కడ ఇబ్బంది ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. ఇక వీరు కాకుండా అలిసన్ డూడీ, అజయ్ దేవగన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్పాండే, చత్రపతి శేఖర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటివరకు 1140 కోట్ల దాకా వసూలు చేసింది. జపాన్ వసూళ్లతో అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)

Also Read: Godfather Vs Lucifer: లూసిఫర్ దరిదాపుల్లోకి రాలేకపోయిన గాడ్ ఫాదర్.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?

Also Read: Bigg Boss 7th Week Elimination : బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News