Rishab Shetty Acted in Mishan Impossible: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం రెండు కోట్ల రూపాయలతో ఈ సినిమా తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేయగా దానికి పది రెట్లు లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి 18 రోజులు గడవగా 18వ రోజు కూడా 81 లక్షలు కలెక్ట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 22 కోట్ల 68 లక్షలు షేర్, 41 కోట్ల 15 లక్షలు గ్రాస్ సాధించింది.
మొత్తం మీద తెలుగులో ఈ సినిమా 20 కోట్ల 38 లక్షల లాభాలు తెచ్చి పెట్టిన సినిమా కొనుక్కున్న గీతా సంస్థకు భారీగా లాభాలు అర్జించి పెట్టింది. అయితే రిషబ్ శెట్టి గతంలో కిరిక్ పార్టీ వంటి సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే నిజానికి ఆయన ఒక తెలుగు సినిమాలో కూడా నటించాడు. అది కూడా ఈ ఏడాది విడుదలైన సినిమాలోనే. ఆ సినిమా మరేంటో కాదు, మిషన్ ఇంపాజిబుల్.
ముగ్గురు బాలల ప్రధాన పాత్రల్లో తాప్సీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ అంచనాలతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రిషబ్ శెట్టి ఈ సినిమాలో రెండు నిమిషాల ఒక చిన్న పాత్రలో కనిపించాడు. మిషన్ ఇంపాజిబుల్ కథ ప్రకారం ముగ్గురు బాలలు ముంబై వెళుతున్నాము అనుకుని బెంగళూరు వెళ్తారు.
అక్కడ ఒక చిన్నపాటి దొంగ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖలీల్ అనే పాత్రలో రిషబ్ శెట్టి కనిపిస్తాడు. స్వరూప్ తీసిన మొదటి సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ బాగా నచ్చడంతో తనను కలిసినప్పుడు రిషబ్ శెట్టి ఆయనను అభినందించాడట అలా వారిద్దరి మధ్య పరిచయం మొదలై స్నేహానికి దారితీసింది. మీకోసం ఒక పాత్ర అనుకున్నాను మీరే చేయాలని అడిగితే ఎలాంటి డబ్బు తీసుకోకుండా స్వరూప్ స్నేహం కోసమే ఆ సినిమా చేశాడట రిషబ్ శెట్టి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook