RGV: 'MAA వ్యవహారం సర్కస్‌ని తలపించేలా ఉంది'..వైరల్ గా ఆర్జీవీ ట్వీట్

RGV: ఆర్జీవీ ఏది చేసినా సంచలనమే. దేశంలో ఏ ఇష్యూ జరిగినా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు ఆర్జీవీ. తాజాగా 'మా' ఎన్నికలపై సెటైరికల్ గా స్పందించారు రామ్ గోపాల్ వర్మ.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 11:59 AM IST
  • ముగిసిన 'మా' ఎన్నికలు
  • అధ్యక్షుడి విష్ణు ప్రమాణం
  • కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ
RGV: 'MAA వ్యవహారం సర్కస్‌ని తలపించేలా ఉంది'..వైరల్ గా ఆర్జీవీ ట్వీట్

MAA Electons 2021: ఇటీవల జరిగిన 'మా' ఎన్నికలు(MAA Electons 2021) సాధారణ ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే అంశం నుంచి ప్రారంభమై.. వ్యక్తిగత ఆరోపణలు, సినిమా బడ్జెట్లు, అవార్డులంటూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకున్నారు. ఫలితాలు వచ్చాక కూడా హైడ్రామానే నడిచింది. విష్ణు(Manchu Vishnu) ప్రమాణ స్వీకారం చేయడం,  ఆ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీని పిలవకపోవడం, మరో పక్క ప్రకాష్ రాజ్ ప్యానెల్(PrakashRaj Panel)లోని గెలిచిని వాళ్లు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం... ఇవన్నీ సినీఅభిమానులకు కాస్త చికాకు తెప్పించాయి. కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ(RGV)కి మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చినట్టున్నాయి.

‘'మా'’(MAA)లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ‘'మా’'లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Also Read: Manchu Vishnu : ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు మా విజయాన్ని గౌరవించాలి ‌‌- మంచు విష్ణు

అంతకుముందు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్(Aryan Khan) వివాదంపై కూడా సంచలన ట్వీట్లు చేశాడు ఆర్జీవీ. షారూఖ్ కన్నా ముందే ఆర్యన్ ను మీడియా, ఎన్సీబీ(NCB)లు లాంచ్ చేసేశాయని ట్వీట్ చేశాడు. జైల్లోనే చాలా నేర్చుకుని ఆర్యన్ బయటకు వస్తాడని ట్వీట్లో పేర్కొన్నాడు. అలాగే తాను షారూఖ్ ఖాన్ నిజమైన అభిమానినని, జై ఎన్సీబీ’ అని కూడా పేర్కొన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News