Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

Renu Desai Enjoys At Beach Area రేణూ దేశాయ్ తాజాగా బీచ్ ఏరియాలో సందడి చేస్తోంది. బీచ్‌లో అలా మునిగి తేలుస్తోంది. సముద్రపు నీళ్లలో కొట్టుకుపోతోంది. అయితే రేణూ దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఆ కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 06:27 PM IST
  • నెట్టింట్లో రేణూ దేశాయ్ సందడి
  • బీచ్‌లో ఆటలాడుతున్న రేణూ దేశాయ్
  • ఏడ్వాలో నవ్వాలో అర్థం కావడం లేదన్న నటి
Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

Renu Desai Enjoys At Beach Area రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియోలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య కూడా కనిపిస్తోంది. అయితే రేణూ దేశాయ్ ఆ సముద్రపు నీళ్లలో అలా తడుస్తూ ఉంటే.. కొట్టుకుపోతూ ఉంటే.. తన ఫ్రెండ్స్  ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోలు, ఫోటోలు తీస్తున్నారట.. ఎంజాయ్ చేస్తున్నారట. కానీ ఒక్కరూ కూడా తనను పైకి లాగడం లేదని చెప్పుకొచ్చింది. కొన్ని సందర్భాలుంటాయి.. మనకు ఏడ్వాలో నవ్వాలో అర్థం కావు.. ఇది కూడా అలాంటి ఓ సందర్భమే అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రేణూ దేశాయ్‌కు ఎంతటి ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే రేణూ దేశాయ్ మాత్రం సోషల్ మీడియాలో తన వ్యథ, బాధను, ఆవేదనను వెల్లగక్కుతూనే వచ్చింది. పవన్ కళ్యాణ్‌ అభిమానులు పెట్టే నెగెటివ్ కామెంట్లు, తిట్టే తిట్లు, మాట్లాడే భాష పట్ల రేణూ దేశాయ్ బాధపడుతూనే వచ్చింది. ఇలానేనా మాట్లాడేది.. మీ ఇంట్లో వాళ్లు నేర్పించలేదా? ఇలానే మాట్లాడతారా? అంటూ రేణూ దేశాయ్ కూడా పవర్ స్టార్ అభిమానులపై విరుచుకుపడింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సోషల్ మీడియాలో అకిరా గురించి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చివరకు రేణూ దేశాయ్‌తో గొడవలు కూడా పడుతున్నారు. అకిరా తమ అన్న కొడుకు అని నొక్కి మరీ చెబుతున్నారు. అకిరా నా అబ్బాయి అని రేణూ దేశాయ్ అంటే.. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ మాత్రం తమ అన్న కొడుకు అని చెప్పుకుంటున్నారు. ఇలా వారం రోజుల నుంచి వాగ్వాదం జరుగుతూనే వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

కానీ తాజాగా రేణూ దేశాయ్ మాత్రం నవ్వుతూ కనిపించింది. తన బాధలన్నీ మర్చిపోయి ఇలా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఇందులో రేణూ దేశాయ్ నవ్వుతూ ఉంటే.. నీళ్లతో ఆడుకుంటూ ఉంటే.. ఆద్య ఈ ఫోటోలు, వీడియోలు తీసినట్టుగా అనిపిస్తుంది. ఇక రేణూ దేశాయ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా వెకేషన్‌కు వెళ్లినట్టు అనిపిస్తోంది.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News