Mr Bachchan pre release business: స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. దర్శకత్వంలో.. రూపొందుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఏ మేరకు జరిగింది.. అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్‌లో.. విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రీ పోన్ అయ్యి.. ఇప్పుడు ఆగస్టు 15న లాంగ్ వీకెండ్ సందర్భంగా విడుదల కాబోతోంది. ఆగస్టు 14న చిత్ర ప్రీమియర్ షోస్ పదనున్నాయి. సినిమా పై బజ్ కూడా ఎక్కువగానే ఉంది.
ఈ చిత్రం హిందీలో.. సూపర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి.. ఇంట్లో జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే పేరుకి రీమేక్ అయినా కూడా హరీష్ శంకర్.. ఈ కథను తనదైన స్టయిల్లో మాస్ టచ్ ఇచ్చారని తెలుస్తోంది. రైడ్ స్క్రిప్టుని.. మాస్ అప్పీల్ తో మార్చారని చెప్తున్నారు. రీమేక్ లను.. కూడా తనదైన స్టైల్ లో తీయడంలో హరీష్ శంకర్ దిట్ట. కాబట్టి ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
రవితేజ ఈ సినిమాలో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. సినిమాలో రవితేజ నిజాయితీ గల ఒక ఆదాయ పన్ను అధికారిగా.. కనిపించనున్నారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. చిత్ర థియేట్రికల్ బిజినెస్ 40 కోట్లు దాకా జరిగిందని సమాచారం. ఇది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఓటిటి రైట్స్, హిందీ డబ్బింగ్ యూట్యూబ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపితే సినిమా అప్పుడే పూర్తి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే రిలీజ్ కు ముందే సినిమా.. సేఫ్ జొన్ లోకి వెళ్లినట్లు చెప్పుకోవచ్చు.
హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్, మిరపకాయ్ రెండూ ప్రేక్షకులను మెప్పించాయి కూడా. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు కాదు. వీళ్ళిద్దరూ కాంబోలో వస్తున్న మొదటి రీమేక్ సినిమా.. మిస్టర్ బచ్చన్. ఇక ఈ క్రేజీ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ముందే కామెంట్స్ చేస్తున్నారు. క్యాడ్‌బరీ యాడ్‌తో పాపులర్ అయిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter