Sundaram Master Collections: మాస్ మహారాజ్ గా ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్న నటుడు రవితేజ. కాగా గత కొద్దికాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా అతను నటించిన ఈగల్ చిత్రం కూడా అంతంత మాత్రం పర్ఫామెన్స్ తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే నెక్స్ట్ ప్రొజెక్ట్స్ పై రవితేజ మరింత దృష్టి పెట్టినట్లు టాక్.
యాక్టింగ్ తో పాటు రవితేజ నిర్మాణంలో కూడా దిగిన విషయం అందరికీ తెలిసిందే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో అతను తన సొంత బ్యానర్ పై సినిమాలు తీస్తున్నాడు. అయితే ఈ సినిమాలు అతనికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి అనేది వినికిడి. రవితేజ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఛాంగురే బంగారు రాజా సినిమా భారీ కమెడియన్ క్యాస్టింగ్ తో తీసినప్పటికీ .. అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆ చిత్రం మెప్పించలేదు. పేలవమైన రైటింగ్ తో పాటు అంతంతమాత్రంగా ఉన్న డైరెక్షన్ కారణంగా ఆ చిత్రాం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ఇక తాజాగా అతని నిర్మాణంలో తెరకెక్కించిన సుందరం మాస్టారు చిత్రం కూడా కలెక్షన్స్ పరంగా చాలా వీక్ గా ఉంది. అసలు ప్రేక్షకులు ఈ సినిమాపై ఎటువంటి ఆసక్తి చూపించడం లేదు అన్న విషయం మార్నింగ్ షో లో ఆక్యుపెన్సి చూస్తేనే అర్థమవుతుంది. ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కంటే కూడా సందేశాత్మకమైన యాంగిల్ ఎక్కువగా ఉంది. సాగదీసే కంటెంట్ .. సహనాన్ని పరీక్షించే సెకండ్ హాఫ్.. ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్స్. దీంతో ఈ మూవీ కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కలెక్షన్స్ పరంగా సినిమా పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నా రవితేజ కి వీటి వల్ల పెద్ద రిస్క్ ఉండదు. సాటిలైట్ రైట్స్, డబ్బింగ్ ఇలా ఏదో ఒక రూపంలో అతను పెట్టిన పెట్టుబడి ఎంతో కొంత వెనక్కి వస్తుంది. అయితే ఇలాంటి సినిమాలు కారణంగా రవితేజ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రేక్షకులలో రవితేజ అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. కాబట్టి అతను తీసే సినిమాలు అంటే వాటి నుంచి కొంత వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటికే రవితేజ వరుస ఫ్లాప్ మూవీస్ తో హీరోగా ఇబ్బంది పడుతున్నాడు.. ఇలా అతను తీసే సినిమాలు కూడా వరుస డిజాస్టర్స్ గా మారితే.. అది అతని ఇమేజ్ పైన ప్రభావం చూపిస్తుంది అని సినీ విశ్లేషకుల అంచనా. కాబట్టి ఇకనైనా రవితేజ క్వాలిటీ సినిమాలపై దృష్టి పెట్టాలి. లేదంటే అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫ్లాప్స్ తప్పేటట్టు లేవు.
Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి