Pawan kalyan New Movie: పవన్-హరీశ్​ శంకర్​ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి!

Pawan kalyan new movie: పవన్ కల్యాణ్-హరీశ్​ శంకర్​ కాంబోలో రాబోతున్న చిత్రం 'భవదీయుడు భగత్​ సింగ్'. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి నటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 04:44 PM IST
Pawan kalyan New Movie: పవన్-హరీశ్​ శంకర్​ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి!

Pawan kalyan-Raveena Tandon: హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్​కల్యాణ్​ (Pawan kalyan) నటిస్తున్న సినిమా 'భవదీయుడు భగత్​ సింగ్'(Bhavadiyudu Bhagat singh). తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నటించనున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.  ఇటీవల 'కేజీఎఫ్​ 2' సినిమాతో మంచి గుర్తింపు  తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్​ (Raveena Tandon)ను పవన్ సినిమాలో ఓ కీలకపాత్ర అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ చేయడానికి ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hedge) నటించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

పవన్ కల్యాణ్ ఇతర సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాకు స్టార్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమాకు రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో ఐదు భాషలలో ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. మెుగలుల కాలం నాటి కథతో ఈ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంత నిజమో మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. 

Also Read: Harihara Veeramallu: పవన్ కల్యాణ్​ 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News