Rathnam Movie: 'రత్నం' పక్కా పైసా వసూల్ సినిమా: హీరో విశాల్

Hero vishal: స్టార్ డెరైక్టర్ హరి- హీరో విశాల్ కాంబోలో రాబోతున్న మూవీ రత్నం. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కాబోతుంది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 20, 2024, 08:36 PM IST
Rathnam Movie: 'రత్నం' పక్కా పైసా వసూల్ సినిమా: హీరో విశాల్

Rathnam Movie Promotions: విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రత్నం. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహారించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది. 

ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ''19 ఏళ్ల నా సినీ కెరీర్‌లో అభిమానులు, మీడియా వారు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. నరసింహారెడ్డి కాలేజ్‌కు సారీ. అక్కడ ఈవెంట్ పెట్టలేకపోయాం. సక్సెస్ మీట్‌ను అక్కడే నిర్వహిస్తాం. గతంలో హరి గారితో చేసిన భరణి, పూజ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాం. మమ్మల్ని నమ్మి సినిమా తీసుకున్న సతీష్ గారికి ధన్యవాదాలు. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అలరిస్తుంది. మాతో కలిసి పనిచేసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి. కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి''’ అని విశాల్ అన్నారు.

Also Read: Avantika Vandanapu: అందాల హద్దులను చెరిపేస్తున్న తెలుగమ్మాయి.. మరి ఈ రేంజ్ లోనా..

 డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ.. ‘విశాల్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే రత్నం చిత్రాన్ని తీసుకున్నాను. హరి గారి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Also read: Ramya Pasupileti: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన హుషారు బ్యూటీ, ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News