Rashmika Saami Saami: రష్మికను వెంటాడుతున్న 'సామి సామి' క్రేజ్.. పాట పవర్ ఇంకా తగ్గలే!!

పుష్ప సినిమా తరువాత రష్మిక గురించి తెలియని వారుండరు. ఆ క్రేజ్ తో రష్మిక ఇపుడు భాషతో సంబంధం లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన పుష్ప సినిమాలోని రారా సామీ పాటపై ఒక స్కూల్ పాప చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 10:25 PM IST
Rashmika Saami Saami: రష్మికను వెంటాడుతున్న 'సామి సామి' క్రేజ్.. పాట పవర్ ఇంకా తగ్గలే!!

Rashmika Saami Saami: నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక అంటే తెలియని సినీ ప్రేమికులు ఎవరూ ఉండరు. ఎందుకంటే 'పుష్ప' సినిమా తర్వాత ఆమె పాన్ ఇండియా స్థాయిలో అంతటి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలకి పరిమితమైన రష్మిక.. ఆ తర్వాత అనేక బాలీవుడ సినిమాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. ఆమె ప్రస్తుతం 'యానిమల్', 'పుష్ప 2'తో పాటు నితిన్ సరసన హీరోయిన్ గా మరో చిత్రంలో నటిస్తోంది. 

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన 'పుష్ప' సినిమాలోని 'సామి సామి' సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటలోని రష్మిక స్టెప్పులకు ఎంతో మంది ఫిదా అయ్యారు. అయితే ఈ సాంగ్ వచ్చి ఏళ్లు గడుస్తున్న ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని ఓ స్కూల్ ఫంక్షన్ లో ఓ చిన్న పాప 'సామి సామి' పాటకు స్టెప్పులేసింది. 

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ రష్మికను ఆ చిన్న పాప అనుసరించడం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు హీరోయిన్ రష్మిక కంట పడింది. ఈ వీడియో కింద ఆమె కామెంట్ చేస్తూ.. 'సో క్యూట్' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

Also Read: Samantha Pet Dog: నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ ఉందేంటి? వాళ్లిద్దరూ కలిసిపోయారా..?

అయితే 'పుష్ప: ది రైజ్' సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 'శ్రీవల్లీ', 'సామి సామి', 'ఊ అంటావా..ఊఊ అంటావా', 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' సాంగ్స్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు స్టెప్పులేస్తూ.. సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేశారు. ఈ ట్రెండ్ ఎప్పుడో స్టార్ట్ అయినా.. ఇప్పటికీ అది అలాగే కొనసాగతుండడం పట్ల హీరోయిన్ రష్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

రష్మిక కొత్త సినిమాలు..
హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లో అనేక సినిమాలకు ఓకే చెప్పింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా.. రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'యానిమల్' ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధం అయ్యింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో పాటు ఆమె క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read: ఇట్స్ అఫీషియల్... రజినీ 170వ చిత్రంలో రానా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News