Rashmika's Health Issue: రష్మికకు చర్మ వ్యాధి సోకిందా..? ఆ పోస్ట్ అర్థం అదేనా..?

Rashmika Mandanna Health: రష్మిక మందాన్న తాజాగా తన దినచర్యను చెప్పింది. సోమవారం నాడు ఎలా గడిచిందో చెబుతూ షేర్ చేసిన మ్యాటర్‌లో ఓ చిన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. డెర్మటాలజిస్ట్‌ను రష్మిక కలిసినట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 11:53 AM IST
  • నెట్టింట్లో నేషనల్ క్రష్‌ రష్మిక సందడి
  • సోమవారం ఎలా గడిచిందో చెప్పిన హీరోయిన్
  • డెర్మటాలజిస్ట్‌ను కలిసిన రష్మిక?
Rashmika's Health Issue: రష్మికకు చర్మ వ్యాధి సోకిందా..? ఆ పోస్ట్ అర్థం అదేనా..?

Rashmika Mandanna Health Issue: హీరోయిన్లంతా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సమంత నుంచి మొదలుకొని కల్పికా గణేష్, మమతా మోహన్ దాస్ ఇలా చాలా మంది సెలెబ్రిటీలు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే తాజాగా రష్మిక మందాన్న కూడా ఇలాంటి ఓ సమస్యతోనే బాధపడుతోందా? అనే కొత్త రూమర్ బయటకు వచ్చింది. అలాంటి టాక్ రావడానికి కూడా ఓ కారణం ఉంది.

రష్మికకు డైరీ రాసుకోవడం అలవాటు. రోజంతా ఏం చేశాను అన్నది.. అలా అలా టాపిక్స్ చెబుతూ డైరీ రూపంలో తన అభిమానులతో పంచుకుంటుంది రష్మిక. ఈ క్రమంలో సోమవారం నాడు రష్మిక చేసిన పనుల గురించి తెలిపింది. ఇందులో చెప్పిన ఓ విషయంలో ఈ రూమర్ రావడానికి కారణం అయింది.

రష్మిక మందాన్న సోమవారం నాడు చేసిన పనులేంటంటే.. ఈ రోజు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా గడిచింది.. లేచాను.. లేచిన వెంటనే కార్డియో ఎక్సర్ సైజ్ చేశాను.. తరువాత కొంచెం తిన్నాను.. రేపటి కోసం అన్నీ సర్దుకున్నాను.. ఆరా, స్నోలు నేను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ నాటకాలు ఆడాయి..  ఆ తరువాత మళ్లీ కొంత వర్కౌట్లు చేశాను.. ఆ తరువాత డిన్నర్ కూడా అయింది.

డెర్మట్ (డెర్మటాలజిస్ట్‌)తో ఓ అపాయింట్మెంట్ జరిగింది.. ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండాల్సింది కానీ అది క్యాన్సిల్ అయింది.. దాంతో ఇంటికి వచ్చి పడుకున్నాను అంటూ ఇలా చెప్పుకుంటూ పోయింది. ఇందులో డెర్మట్ అంటే.. డెర్మటాలజిస్ట్ అని అర్థం అవుతోంది. చర్మానికి సంబంధించిన ఏదో సమస్య వచ్చినందుకే ఇలా డాక్టర్‌ను సంప్రదించింది అని టాక్ బయటకు వచ్చింది.

కానీ దీనిపై రష్మిక మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి నిజంగానే రష్మికకు స్కిన్ ప్రాబ్లం ఉండటంతోనే డెర్మటాలజిస్ట్‌ను కలిసిందా? లేదా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం రష్మిక పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం రెడీగా ఉంది. గీత గోవిందం సీక్వెల్ సెట్స్ మీదకు వస్తే.. అందులో మళ్లీ విజయ్ రష్మిక జోడి ఆకట్టుకుంటుందనడంలో సందేహం అయితే లేదు. మరి ఈ సీక్వెల్ సంగతి ఏం అవుతుందో చూడాలి.

Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?

Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News