Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?

Krithi Sanon replaces Rashmika Mandanna. రష్మిక మందన్న త్వరలోనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో దలపతి విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే రష్మిక స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 04:46 PM IST
  • రష్మికకు ఊహించని షాక్
  • రష్మికను సైడ్ చేసిన విజయ్
  • రష్మిక స్థానంలో బాలీవుడ్ బ్యూటీ
Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?

Rashmika Mandanna replaced by Krithi Sanon in Vijay's 66 Movie: 'ఛలో' సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమెను వరుస అవకాశాలు వరించాయి. ఓ వైపు అందం, మరోవైపు నటనతో ఆకట్టుకుంటూ.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టారు. వచ్చిన అవకాశాలను ఒడిసిపడుతూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. రష్మికకు 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. పుష్ప కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో విజయవంతం కావడంతో.. పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఉన్న ఈ కన్నడ బ్యూటీ.. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్నారు. 

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న త్వరలోనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో దలపతి విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికను ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టారట. ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విజయ్ కూడా కృతికే ఒకే చెప్పడంతో.. రష్మికను చిత్ర యూనిట్ సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాల్సిన కథను మార్చి విజయ్‌తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు వంశీ పైడిపల్లి. విజయ్‌కి ఇదే తొలి తెలుగు స్ట్రైట్ సినిమా కావడంతో మరింత హైప్‌ నెలకొంది. దిల్‌ రాజు ఈ పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారట. గత కొంతకాలంగా వరుసగా హిట్స్ అందుకుంటున్న విజయ్ ..తన సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఏప్రిల్ 13న 'బీస్ట్' అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

Also Read: Gayatri Bharadwaj: టైగర్ నాగేశ్వరరావులో ఇద్దరు హీరోయిన్స్.. రవితేజ సరసన హాట్ మోడల్!!

Also Read: Gaalivaana Trailer: ఆ.. కొడుకు నా కంటికి కనపడితే ఆ దేవుడు కూడా కాపాడలేడు! 'గాలివాన' ట్రైలర్‌ అదుర్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News