Rashmika Mandanna: పుష్ప 2 నుంచి మరో లీక్..శ్రీవల్లిగా రష్మిక ఫోటో వైరల్..

Pushpa Leaks: పుష్ప: ది రూల్  సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. సినీ ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2024, 04:09 PM IST
Rashmika Mandanna: పుష్ప 2 నుంచి మరో లీక్..శ్రీవల్లిగా రష్మిక ఫోటో వైరల్..

Rashmika Mandanna Leaked Pic

పుష్ప: ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో విజయం సాధించి .. ప్రస్తుతం రాబోతున్న సీక్వెల్ పుష్ప: ది రూల్ పైన అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో పుష్పా రెండో భాగం నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చిన అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు. ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. ఇటీవల వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే 'పుష్ప 2' మూవీ టీమ్ కి లీకుల బెడద ఎక్కువైపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొన్ని ఫోటోలు బయటకి వచ్చి వైరల్ కాసాగాయి. గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ జాతర ఫోటో తెగ వైరల్ కాగా ఇప్పుడు ఏకంగా రష్మిక శ్రీవల్లి క్యారెక్టర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప చిత్రంలోని శ్రీవల్లి క్యారెక్టర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందాన. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంతగా పేరు తెచ్చుకునేందో.. శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను అంతగానే మెప్పించింది. కాగా ఇప్పుడు పుష్ప రెండో భాగంలో శ్రీవల్లి క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

రష్మిక ఎరుపు రంగు చీరలో ఒంటినిండా నగలతో ముస్తాబై ఉన్న వీడియో లీకై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పుష్ప సినిమా సెట్స్ నుంచి ఈ పిక్ వైరల్ కావడం విశేషం. ఇది చూసిన ఫాన్స్ శ్రీవల్లి పాత్రలో రష్మిక మహారాణిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటి అంటే ఈ చిత్రం రెండో భాగం లో రష్మిక.. పుష్ప భార్యగా కనిపించబోతోంది కాబట్టి..ఒంటినిండా బంగారం వేసుకొని ఉండబోతుంది అని.. అందుకే ఈ ఫొటోస్ లో ఇలా ఉంది అని.. ఈ చిత్ర కథ గురించి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

 

ఏది ఏమైనా మొత్తానికి లీకైన ఈ ఫోటో పుష్పా సినిమా పైన మరిన్ని అంచనాలను పెంచింది. కాగా 'పుష్ప 2' లేటెస్ట్ షెడ్యూల్ ని యాగంటి లో ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోని స్టేటస్ తో హీరోయిన్ రష్మిక మందన స్వయంగా తెలిపింది.  “ఇక ఈ రోజు యాగంటి టెంపుల్ లో షూట్ చేసాం. ఈ ప్రదేశం యొక్క చరిత్ర ఎంతో అద్భుతం. అలాంటి ఈ చారిత్రాత్మక గుడిలో కొంత సమయాన్ని గడపడం ఇంకెంతో అద్భుతంగా అనిపించింది" అని రష్మిక ఆ స్టేటస్ లో రాసుకోచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ పుష్ప: ది రూల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్ సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక లతోపాటు ఫాహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్ బండారి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

 

 

 

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News