Rashmika Vijay: దేవరకొండతో డేటింగ్ రూమర్స్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. అంతా సిగ్గే?

Rashmika dating with Vijay Devarakonda: రష్మిక -విజయ్ దేవరకొండ డేటింగ్ గురించి ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడూ పెద్దగా ఖండించలేదు. అయితే తాజాగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 19, 2023, 03:27 PM IST
Rashmika Vijay: దేవరకొండతో డేటింగ్ రూమర్స్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. అంతా సిగ్గే?

Rashmika enjoying rumors on dating with Vijay Devarakonda: సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఎక్కువగా హీరోల మీద హీరోయిన్ ల మీద ఇతర ఆర్టిస్టుల మీద రకరకాల గాసిప్స్ తెర మీదకు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నటీమణుల విషయానికి వస్తే వారు నిజంగా ఏదైనా హీరోతోనో లేక ఇంకెవరితో అయినా రిలేషన్ లో ఉన్నా సరే ఈ విషయం మీద వస్తున్న గాసిప్స్ మీద మాత్రం ఫైర్ అవుతూ ఉంటారు.

నేరుగా వారి ముఖాల మీద ఇలాంటి గాసిప్స్ గురించి ప్రశ్నిస్తే వెంటనే ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. వారి పేరు పలికినప్పుడు కానీ వారి పేర్లతో టీజ్ చేసినప్పుడు గాని వారు చాలా సీరియస్ అవుతూ ఉంటారు. అయితే రష్మిక మందన మాత్రం ఈ విషయంలో లైట్ తీసుకుని వాటిని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి గీత గోవిందం అనే సినిమాలో నటించారు.

Also Read: Bichagadu 2 Review: విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఈ క్రమంలో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని కలిసి డేటింగ్ చేస్తున్నారని రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడూ నేరుగా ఖండించిన దాఖలాలు లేవు. ఈ మధ్యనే రష్మిక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ అనే సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతున్న సమయంలో అభిమానుల్లో చాలామంది విజయ్ దేవరకొండ పేరు అరుస్తూ ఆమెను టీజ్ చేయడం కనిపించింది.

అయితే సాధారణంగా ఇలాంటి సమయంలో ఆమె అసహనం వ్యక్తం చేసి వాళ్ళని ఆపమని స్పీచ్ కంటిన్యూ చేయాలి కానీ ఆమె వారి మాటలకు నవ్వుకుంటూ స్పీచ్ కంటిన్యూ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నిజంగానే వీరు వచ్చే ఏమైనా ఉందేమో అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని వాదన ఇప్పుడు తెర మీదకు వస్తుంది. ఇక ఇదే సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాత్రం తన అసహనాన్ని నవ్వుతూనే వ్యక్తం చేశాడు. తాను ఇంకా పీకిందేమీ లేదని తన గురించి గొప్పగా కామెంట్లు చేస్తుంటే నిజంగా పొగడుతున్నారో ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. 

Also Read:  Virupaksha OTT Release: ఓటీటీలోకి విరూపాక్ష.. ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News