బుల్లితెరపై ఓ కామెడీ షోకి హోస్టింగ్ చేస్తోన్న యాంకర్ రష్మీకి, అదే షోలో కమెడియన్‌గా నటిస్తున్న సుడిగాలి సుధీర్‌కి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని పుకార్లు షికార్లు చేయడం ఇవాళ కొత్తేం కాదు. అయితే, జనం అనుకుంటున్నట్టుగా తమ మధ్య ఏమీ లేదని తరచుగా ఆ ఇద్దరూ ఖండిస్తూనే వస్తున్నా.. ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ మాత్రం పడటం లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఓ డ్యాన్సింగ్ షోలో రెండు వేర్వేరు బృందాల కంటెస్టెంట్స్ కి లీడర్స్ గానూ వ్యవహరిస్తున్న క్రమంలో తరచుగా వస్తున్న ఈ తరహా పుకార్లు ఆ ఇద్దరికీ కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే తయారైందని తెలుస్తోంది. తాజాగా ఇదే పుకార్లకు కొనసాగింపుగా అన్నట్టుగా రష్మీకి ట్విటర్‌లో ఓ అభిమాని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. సుధీర్‌ని పెళ్లి చేసుకో. మీరు ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు. పైగా కెరీర్ కోసం చాలా కష్టపడుతున్నారు అని అతడు ఇచ్చిన సలహా చూశాకా రష్మీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే పుకార్లతో విసిగిపోయి ఉన్న రష్మీ వెంటనే అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. " కేవలం తెరపై కలిసి కనిపించినంత మాత్రాన్నే మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నువ్వెలా చెప్పగలవు" అని అతడిని నిలదీసిన రష్మీ.. "ఆన్ స్క్రీన్‌పై కలిసి పనిచేయడం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. ఆ రెండింటినీ వేర్వేరుగా చూడటం నేర్చుకోండి" అంటూ క్లాస్ ఇచ్చుకుంది.
And how do u know that we are made for each other just because u see us inact something on the screen..... high time u guys learn to separate REEL LIFE FROM REAL LIFE
What we do on screen is to entertain our audience tats all
Who we marry is our call
And no suggestions needed https://t.co/vsxmycJHzt— rashmi gautam (@rashmigautam27) June 20, 2018
And that was my minimum response
Tat don’t tell me what to do about my personal life
I guess I’m entitled to my life by all means https://t.co/Mw6H7rkWbn— rashmi gautam (@rashmigautam27) June 20, 2018
వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ విషయంలో కలుగజేసుకుని సలహాలు ఇస్తే, నేను స్పందించే తీరు ఇలాగే ఉంటుంది. నేనింకా అంత ఘాటుగా స్పందించలేదు కానీ లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందన్నట్టుగా మరో ట్వీట్‌లో రష్మీ ఇంకొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది.