Ranveer Singh FIR: న్యూడ్ ఫోటోషూట్‌.. స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు!

FIR filed against Bollywood Hero Ranveer Singh for nude photoshoot. బాలీవుడ్‌ స్టార్ హీరో, దీపికా పడుకోణె భర్త రణ్‌వీర్‌ సింగ్‌పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 26, 2022, 03:46 PM IST
  • న్యూడ్ ఫోటోషూట్‌
  • స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ న‌మోదు
  • నెట్టింట హాట్ టాపిక్
Ranveer Singh FIR: న్యూడ్ ఫోటోషూట్‌.. స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు!

FIR filed against Hero Ranveer Singh for posting Nude Photoshoot: బాలీవుడ్‌ స్టార్ హీరో, దీపికా పడుకోణె భర్త రణ్‌వీర్‌ సింగ్ పేరు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండడం పెద్ద సంచలనం సృష్టించింది. రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ ఒక్క బాలీవుడ్‌నే కాకుండా.. భారత్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నగ్న చిత్రాపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే.. ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించారు. రణ్‌వీర్‌ సింగ్ తన్యూడ్ ఫోటోషూట్‌ సాధారణ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని చౌబే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ, మరో మహిళా న్యాయవాది కూడా ర‌ణ్‌వీర్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హీరో రణవీర్ సింగ్‌పై చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రణవీర్‌పై ఐటీ యాక్ట్‌ 67ఏతో పాటు సెక్షన్ 292, 293, 354, 509 కింద కేసు నమోదు చేశారు. చెంబూరు పోలీసు స్టేష‌న్‌లో ర‌ణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ అయింది. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ మరియు గల్లీ బాయ్ వంటి చిత్రాలలో తన పాత్రలకు అవార్డులు అందుకున్న ర‌ణ్‌వీర్‌పై కేసు నమోదవడంప మిశ్రమ స్పందవ వస్తోంది. 

Also Read: Viral Video: ట్రైన్‌లో తండ్రికి ఆహారం పెట్టిన చిన్నారి.. హృదయాన్ని కదిలించే వీడియో!

Also Read: Diabetes Control Tips: షుగర్ పేషెంట్స్‌ బెల్లం టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News