Animal Teaser: రణబీర్ ఊర మాస్ యాక్షన్.. ఇంట్రెస్టింగ్ గా యానిమల్ టీజ‌ర్..

Ranbir Kapoor: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం ఎలా ఉందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 12:55 PM IST
Animal Teaser: రణబీర్ ఊర మాస్ యాక్షన్.. ఇంట్రెస్టింగ్ గా యానిమల్ టీజ‌ర్..

Animal Movie Teaser: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నయా మూవీ యానిమల్’(Animal). అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో బాబీ డియోల్, సీనియర్ న‌టుడు పృథ్వీ రాజ్ విల‌న్ రోల్స్‌లో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యాన‌ర్‌పై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 01న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి.

ఇవాళ రణబీర్ కపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్(Animal Movie Teaser )ను రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. పిల్లల గురించి ఆలోచించారా? అవును నేను తండ్రి కావాలనుకుంటున్నాను. నువ్వు నీ తండ్రిలా ఉండవు కదా? అంటూ రణబీర్ క‌పూర్, రష్మిక మంధాన డైలాగ్ తో టీజర్ మెుదలవుతుంది. క్రిమినల్‌ను కన్నామంటూ అనీల్ కపూర్ చెప్పిన డైలాగ్ గూస బంప్స్ తెప్పిస్తుంది. టీజర్ లో సందీప్ రెడ్డి వంగా మార్కు పక్కాగా కనిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేలా కనిపిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News