Animal Collections: రికార్డులు బ్రేక్.. కానీ తెలుగులో ఆ ఒక్కటి సాధించడం మాత్రం యానిమల్ కి కష్టమే

Animal Record: ఈ మధ్య విడుదలైన సినిమాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా ఏదంటే మాత్రం మనకు ముందుగా గుర్తొచ్చేది యానిమల్. ప్రశంసలు.. విమర్శలు రెండిటిని అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది ఈ చిత్రం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2023, 09:11 PM IST
Animal Collections: రికార్డులు బ్రేక్.. కానీ తెలుగులో ఆ ఒక్కటి సాధించడం మాత్రం యానిమల్ కి కష్టమే

Animal: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదైనా సరే వార్తల్లో నిలవాల్సిందే. ఇందుకు నిదర్శనమే అప్పట్లో అర్జున్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు యానిమల్. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు ఆ చిత్రంలోని బోలెడు సన్నివేశాలు గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఆ సినిమాని అదే రకంగా ప్రేమించిన వారు కూడా ఉన్నారు. అందుకే ఆ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. కాగా ఇదే సీన్ ఇప్పుడు మళ్ళీ యానిమల్ సినిమాకి రిపీట్ అయింది.

ఎంతోమంది ఈ సినిమాని విమర్శించిన ఈ సినిమాకి జేజేలు పలికిన వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా యువతను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఏకంగా 700 కోట్ల క్లబ్బులో చేరడానికి సిద్ధమైపోయింది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన తెలుగులో ఒక మైలురాయి మాత్రం అందుకోలేకపోతోంది. 

దాదాపు 700 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదలైన భారత దేశపు సినిమాలలో ఐదు వందల కోట్ల క్లబ్ దాటిన పదవ చిత్రంగా నిలిచింది. సందీప్ రెడ్డివంగా మార్క్ దర్శకత్వం, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్, రష్మిక మందాన క్యారెక్టర్.. సరికొత్త కాన్సెప్ట్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. కాకా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కన్నా కూడా హిందీ ప్రేక్షకులకు ఎక్కువ కనెక్ట్ అయింది. అందుకే ఈ చిత్రంకి బాలీవుడ్ లో కలెక్షన్స్ విపరీతంగా వస్తున్నాయి. మరోపక్క సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ ఇమేజ్, బలమైన కథ కారణంగా తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే దూసుకుపోతోంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలిగే విధంగా మూవీ లేకపోవడం వలన తెలుగులో కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అయింది కానీ.. అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు.

షారుక్ ఖాన్ హీరోగా చేసిన జవాన్ సినిమా తెలుగులో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. యానిమల్ సినిమా ఈ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. ఎందుకు ముఖ్య కారణం ఈ సినిమాకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ దర్శకత్వం వహించడం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే జవాన్ రికార్డును మాత్రం యానిమల్ అందుకోలేదు అని స్పష్టమైపోతుంది. అంతేకాదు ఈ సినిమా మొదటి మూడు రోజులు పర్ఫామెన్స్ చూసి అందరూ విచిత్రం తప్పకుండా వెయ్యి కోట్ల క్లబ్ కి చేరుతుంది అనుకున్నారు. అయితే ఈ చిత్రం కేవలం తెలుగు.. హిందీ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోవడంతో.. మిగతా భాషల వారికి పెద్దగా ఎక్కకపోవడంతో.. ఇప్పుడు ఈ చిత్రం వెయ్యి కోట్లు సాధించడం అసాధ్యమే అనిపిస్తుంది. ఫైనల్ రన్ లో ఈ చిత్రం దాదాపు 900 కోట్ల వరకు సాధించవచ్చు. ఇక దానిపైన సాధించడం మాత్రం అసలు కుదిరే పని కాదు.

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News