బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల చేత ఔరా అనిపించిన రానా.. రీసెంట్ గా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో హీరో గా నటించి వర్సటైల్ యాక్టర్ గా నిరూపించుకున్నాడు. ఇక టాలెంట్ ను మరింత పదును పెట్టేందుకు మరో భారీ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ..రానా మరో అడ్వెంచరస్ పీరియాటిక్ వార్ డ్రామా కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
అద్భతమైన గ్రాఫిక్స్ వర్క్ తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ మ్యాగ్జిమం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో రానా ఉన్నట్టు తెలుస్తుంది. ఓ వైపు రానా ‘లీడర్ 2’ నటించానున్నాడనే టాక్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంటే, ఇప్పుడీ న్యూస్ కంప్లీట్ ఫోకస్ రానాపై మళ్ళేలా చేస్తుంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న రానా నెక్స్ట్ మూవీ టాక్ జస్ట్ గాసిప్ గా మిగిలిపోనుందా..? లేకపోతే నిజంగానే రానా ఫ్యాన్స్ ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తో మెస్మరైజ్ చేయనున్నాడా..? లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.