25 ఏళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ హీరో దొరికాడు : వర్మ

పాత స్మృతులని నెమరేసుకున్న వర్మ

Last Updated : Feb 16, 2018, 09:08 PM IST
25 ఏళ్ల తర్వాత నాకు మళ్లీ ఓ హీరో దొరికాడు : వర్మ

పాతికేళ్ల క్రితం శివ సినిమాతో టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, అమల జంటగా తెరకెక్కిన ఆ చిత్రం ఆ తర్వాతి తరం దర్శకులకి ఓ డిక్షనరిగా మారింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వర్మ-నాగ్ కాంబినేషన్‌లో ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన కొత్త సినిమా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

తాజాగా తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్న వర్మ.. అప్పట్లో సరిగ్గా ఇదే రోజున, అంటే ఫిబ్రవరి 16న శివ సినిమా షూటింగ్ ప్రారంభమైందని ఓ ట్వీట్ చేశాడు.

 

25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు తనకు ఓ హీరో దొరికాడని.. అతడు ఎవరో కాదు, నాగార్జుననే అని తన ట్వీట్‌లో పేర్కొన్న వర్మ.. నాగ్ చేస్తోన్న యాక్షన్ సీన్స్ అంత సహజంగా వున్నాయని తనదైన స్టైల్లో కితాబిచ్చాడు. అంతేకాకుండా కొత్త సినిమా షూటింగ్ స్టిల్స్ కూడా ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు వర్మ.

Trending News