Skanda Movie: ఇట్స్ అఫిషియల్.. స్కంద ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Skanda Movie: మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన స్కంద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురాబోతున్నారో మేకర్స్ ప్రకటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 12:59 PM IST
Skanda Movie: ఇట్స్ అఫిషియల్.. స్కంద ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Skanda Movie OTT Release date Officially: యంగ్  హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni), మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనివాస్‌ (Boyapati Srinivas) కాంబోలో వచ్చిన మూవీ స్కంద (Skanda). సెప్టెంబర్ 28న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యావ‌రేజ్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 27న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లుగా తేలింది. 

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీని న‌వంబ‌ర్ 02 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో రామ్ కు జోడిగా టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ కోణాన్ని చూపించిన రామ్.. దానిని ఈ సినిమా ద్వారా మరో స్థాయికి తీసుకెళ్లాడు. మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా రిజల్ట్‌ చూసి.. సీక్వెల్ తీస్తారా లేదా పక్కన పెట్టేస్తారా అనేది వేచి చూడాలి. 

Also Read: BB 7 House new Captain: మళ్లీ చక్రం తిప్పిన శివాజీ.. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా డాక్టర్ బాబు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News