Skanda Movie OTT: 'స్కంద' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Skanda Movie:  రామ్ పోతినేని హీరోగా బోయపాటి కాంబినేషన్‍లో వచ్చిన స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2023, 11:27 AM IST
Skanda Movie OTT: 'స్కంద' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Skanda Movie OTT Release date: రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ మూవీకి మిక్సడ్ టాక్ వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినప్పుటికీ తొలి రోజు భారీగానే ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ చెబుతున్నారు.

దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మాస్ ఆడియెన్స్ కు ఈ మూవీ పుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ కోణాన్ని చూపించిన రామ్.. దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమా కోసం దాదాపు 12 కిలోలు పెరిగాడు రామ్. 

తాజాగా ఈ మూవీ ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. స్కంద సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‪‌స్టార్ దక్కించుకుంది. ఓటీటీ డీల్ ప్రకారం, స్కంద సినిమాను నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. దీనిని బట్టి చూస్తే ఈ మూవీ అక్టోబర్ చివరిలో  లేదా నవంబర్ మొదటి వారంలో డిస్నీ ప్లస్ హాట్‪‌స్టార్ లో స్ట్రీమింగ్ అవకాశం ఉంది. 

Also Read: Hero Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు.. రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానంటూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News