Ram Gopal Varma: బర్త్‌డేకు రామ్ గోపాల్ వర్మ సరికొత్త నిర్వచనం, నెటిజన్లు షాక్

Happy Birthday RGV | నేడు ఆయన పుట్టినరోజు కాగా, రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వారితో పాటు ట్విట్టర్ ఫాలోయర్లకు షాకిస్తున్నాడు. ఇది తన పుట్టినరోజు కాదు, చనిపోయిన రోజు అని తనదైన శైలిలో ఆర్జీవీ స్పందిస్తున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 7, 2021, 02:27 PM IST
Ram Gopal Varma: బర్త్‌డేకు రామ్ గోపాల్ వర్మ సరికొత్త నిర్వచనం, నెటిజన్లు షాక్

 HBD RGV | వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజుకు కొత్త అర్థాన్ని చెప్పాడు. నేడు ఆయన పుట్టినరోజు కాగా, రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వారితో పాటు ట్విట్టర్ ఫాలోయర్లకు షాకిస్తున్నాడు. ఇది తన పుట్టినరోజు కాదు, చనిపోయిన రోజు అని తనదైన శైలిలో ఆర్జీవీ స్పందిస్తున్నాడు.

విభిన్నత, అసభ్యతను తన అస్త్రాలుగా చేసుకుని లాక్‌డౌన్ సమయంలోనూ నగ్నం, మర్డర్ లాంటి చిత్రాలు తెరకెక్కించి ఓటీటీ వేదికగా విడుదల చేయడం రామ్ గోపాల్ వర్మకే చెల్లింది. అలాంటి వర్మకు డిఫరెంట్ ఫ్యాన్స్ సైతం ఉన్నారు. నేడు రామ్‌గోపాల్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా రాము స్పందించాడు. ‘ఈరోజు నా పుట్టినరోజు కాదు, నేను చనిపోయిన రోజు. ఎందుకు నా జీవితంలో ఒక సంవత్సరం ముగిసింది’ అంటూ బర్త్‌డేకు సరికొత్త నిర్వచనం చెప్పాడు. ఏడుస్తున్నట్లు కొన్ని ఈమోజీలను రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) పోస్ట్ చేశాడు.

Also Read: Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పక్కనే పెట్రోల్ బంక్, మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

లిరిసిస్ట్ సిరాశ్రీ ట్వీట్‌కు ఆర్జీవీ భిన్నంగా స్పందించాడు. ‘ మీ సమక్షంలో ప్రపంచం ఎన్నటికీ బోర్ కొట్టదు, మీరు ప్రతి సంవత్సరాన్ని మరింత స్వేచ్ఛగా గడుపుతారు. కోరుకున్నది ఏ ఆలోచన లేకుండా చేసేస్తారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని Tollywood లిరిసిస్ట్ సిరాశ్రీ ట్విట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ చదవడం సగంలోనే ఆపేశా అని బదులివ్వడం ఆర్జీవీకి మాత్రమే చెల్లింది. 

Also Read: Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్

ప్రజలకు అసలు ఏం తెలియదంటూ మంగళవారం రాత్రి మరో ట్వీట్ చేశాడు. సమయానుసారం ఏదో ఒక విషయాన్ని చెబుతూ అందరూ అభిప్రాయాలను తమకు తగ్గట్లుగా మార్చుకుంటారని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. తనకు బర్త్‌డే విషెస్ తెలిపిన ఫిల్మ్ మేకర్ బీఎస్‌రవి ట్వీట్‌కు.. నో థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ ఆర్జీవీ బదులిచ్చాడు. మహిళా దినోత్సవం, పురుషుల దినోత్సవం లాంటి రోజులలో తనకు తోచిన విషయాలను చెబుతూ ఈ దర్శకుడు విచిత్రంగా ట్వీట్లు చేయడం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News