Ram Charan Fan : క్యాన్సర్‌తో పోరాడుతున్న బుడ్డోడు.. చిన్నోడి కోరిక తీర్చిన రామ్ చరణ్‌

Ram Charan Met His Fan రామ్ చరణ్‌ తాజాగా తన అభిమాని కోరికను తీర్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్న పిల్లాడి కోసం టైం కేటాయించాడు. సడెన్‌గా కలిసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. చివరి కోరిక అన్నట్టుగా రామ్ చరణ్‌ను కలవాలని చిన్న పిల్లాడు కోరాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 07:05 PM IST
  • క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని
  • చిన్న పిల్లాడి కోసం కదిలిన రామ్ చరణ్‌
  • బుడ్డోడితో సరదాగా గడిపిన మెగా పవర్ స్టార్
Ram Charan Fan : క్యాన్సర్‌తో పోరాడుతున్న బుడ్డోడు.. చిన్నోడి కోరిక తీర్చిన రామ్ చరణ్‌

Ram Charan Fan Suffers From Cancer మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తాజాగా తన బుల్లి అభిమానిని కలిసేందుకు వెళ్లాడు. బుడ్డోడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని తెలిసి, అతనిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, కళ్లలో సంతోషాన్ని నింపేందుకు రామ్ చరణ్‌ స్వయంగా వెళ్లి కలిశాడు. కాసేపు ఆ పిల్లాడి ముచ్చట్లు పెట్టి సరదాగా గడిపాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మణి కౌశల్ అనే పిల్లాడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. మేక్ ఏ విష్ షౌండేషన్ ద్వారా రామ్ చరణ్‌ ఆ బుడ్డోడి కోరికను తెలుసుకున్నాడట. తన అభిమాని అలాంటి స్థితిలో ఉండటంతో రామ్ చరణ్‌ కదిలి వచ్చాడు. పిల్లాడు క్యాన్సర్‌ మీద చేస్తోన్న యుద్దం,పోరాటంలో కొండంత బలం ఇచ్చేందుకు స్వయంగా రామ్ చరణ్‌ వచ్చాడు.

ఆ పిల్లాడితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. సరదాగా గడిపాడు. నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలా సడెన్‌గా సర్ ప్రైజ్ ఇవ్వడం, ప్రత్యేకంగా గిఫ్ట్ ఇవ్వడంతో ఆ పిల్లాడి కల్లల్లో కోటి దీపాలు వెలిగినట్టుగా సంతోషం వెల్లివిరిసిందట. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో అందరి మనసులను దోచేస్తోంది. దటీజ్ రామ్ చరణ్‌.. గోల్డ్‌ రా.. చెర్రీ బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రామ్ చరణ్‌ ఈ రోజు హైద్రాబాద్‌లోకి వచ్చాడు. నేడు చార్మినార్ వద్ద శంకర్ సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అభ్యుదయ పార్టీ ప్రచార ఎన్నికల సీన్‌ను తెరకెక్కించినట్టు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోల ద్వారా తెలుస్తోంది. దిల్ రాజు టీం ఎంత కష్టపడ్డా కూడా ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. రాజకీయ నాయకుడిగా, కాలేజ్ కుర్రాడి, ఎన్నికల అధికారిగా రామ్ చరణ్‌ మూడు పాత్రల్లో అదరగొట్టబోతోన్న సంగతి అందరికీ అర్థమైంది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News