Ram Charan Meets PM : నేటి సాయంత్రం ప్రధానిని కలవనున్న రామ్ చరణ్‌

Ram Charan Meets PM Narendra Modi రామ్ చరణ్‌ నేడు ప్రధానికి కలవబోతోన్న సంగతి తెలిసిందే. ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈవెంట్‌లో భాగంగానే ఐదుగురు ప్రధాన ప్రభావశీలుర భేటిలో రామ్ చరణ్ సందడి చేయబోతోన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 10:13 AM IST
  • ప్రధానిని కలవనున్న రామ్ చరణ్‌
  • ఇండియా కాంక్లేవ్ ఈవెంట్‌లో చెర్రీ
  • నేషనల్ వైడ్‌గా రామ్ చరణ్ సందడి
Ram Charan Meets PM : నేటి సాయంత్రం ప్రధానిని కలవనున్న రామ్ చరణ్‌

Ram Charan Meets PM Narendra Modi రామ్ చరణ్ నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్ ఈవెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ గాడ్ సచిన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ వంటి వారు ఈ భేటీలో పాల్గొనబోతోన్నారు. ఐకాన్ ఆఫ్ ఇండియాగా మోడీ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరు కాబోతోన్నారు. రామ్ చరణ్‌ సైతం ఈవెంట్లో వక్తగా పార్టిసిపేట్ చేయబోతోన్నాడు. సచిన్, జాన్వీ కపూర్, మలైకా అరోరా ఇలా ఒక్కో రంగం నుంచి ప్రముఖ వ్యక్తులను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ టీం అంతా కూడా ఇండియాకు చేరుకుంది. ఇందులో ఎన్టీఆర్ కాస్త ముందుగానే వచ్చాడు. రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ అంతా కూడా హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. రామ్ చరణ్‌ మాత్రం నేరుగా ఢిల్లీలోనే దిగబోతోన్నాడు. ఇక రామ్ చరణ్‌ కోసం నేషనల్ మీడియా, అభిమానులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద రెడీగా ఉన్న విజువల్స్ ఇప్పటికే వైరల్ అవుతోన్నాయి.

ఈ ఈవెంట్‌లోనే రామ్ చరణ్‌ని ప్రధాని ప్రత్యేకంగా సత్కరించబోతోన్నట్టుగా సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల ప్రధాని సంతోషాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా సన్మానించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఈ విషయంలోనూ వార్ జరుగుతోంది. రామ్ చరణ్‌ ప్రధాని మీటింగ్‌లో సందడి చేయబోతోంటే.. ఎన్టీఆర్ మాత్రం విశ్వక్ సేన్ ధమ్కీ ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు.. రేంజ్ మ్యాటర్స్ అంటూ ఇలా మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. ఏ విషయం దొరికినా చాలు ఇటు నందమూరి, అటు మెగా అభిమానులు రెచ్చిపోతూనే ఉన్నారు.

Also Read:  Kaala Bhairava Trolls : తారక్, చరణ్‌ పేర్లను మరిచిన సింగర్.. నెటిజన్ల ఆగ్రహం.. దెబ్బకు దిగొచ్చిన కాళ భైరవ

Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్‌ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News