Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరాచకం..ఆకట్టుకున్న గేమ్ చేంజర్ ట్రైలర్…అదే హైలైట్..!

Game changer trailer review: శంకర్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు.. చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సినిమా విడుదలకి ఇంకా పది రోజులు ఉండగానే..చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 2, 2025, 06:05 PM IST
Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరాచకం..ఆకట్టుకున్న గేమ్ చేంజర్ ట్రైలర్…అదే హైలైట్..!

Game changer trailer public response: ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి పాన్ ఇండియా పరంగా.. ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఇప్పటివరకు.. ఎటువంటి పాన్ ఇండియా సినిమాలో కనిపించలేదు. ఆర్.ఆర్.ఆర్ తరువాత చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేసిన కూడా..అది తెలుగులో మాత్రమే విడుదలయింది. అంతేకాకుండా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత.. మరోసారి గేమ్ చేంజెర్  సినిమాతో..ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయారు ఈ గ్లోబల్ స్టార్. 

శంకర్ దశకత్వంలో వస్తున్న.. ఈ సినిమా ఎన్నో సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోవడం గమనర్హం. కాగా ఈ చిత్రం ఫైనల్ గా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈరోజు ఎన్నో అంచనాల మధ్య విడుదలయింది. 

చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే.. వివిధ పాత్రలలో రామ్ చరణ్ అదరగొట్టారు. ముఖ్యంగా హెలికాప్టర్ నుంచి లుంగీలో రామ్ చరణ్ దిగే షార్ట్ హైలెట్గా నిలిచింది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో అంజలితో సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. మొట్టానికి మొన్నటి వరకు ఈ సినిమా మీద సాదాసీదా అంచనాలు ఉన్న.. ఈ ట్రైలర్ కాస్త ఈ అంచనాలను రెట్టింపు చేసింది.

 

 

సాయి మాధవ్ బుర్ర రాసిన కొన్ని డైలాగ్లు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. “కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు... ఒక్క ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమీ లేదు..కానీ ఆ ఒక్క ముద్ద లక్ష చీమలకు ఆహారం...నేను అడిగేది ఆ ఒక్క ముద్దే..,”అంటూ వచ్చే మెసేజ్ ఓరియెంటెడ్ డైలాగులు.. ఈ సినిమాలో తప్పకుండా శంకర్ మార్క్ ఉంటది అనేలా చేశాయి. అంతేకాదు నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్ కానీ నేను చనిపోయే వరకు ఐఏఎస్ అనే డైలాగ్ కూడా ప్యూర్ విజువల్ స్టఫ్ లా అనిపిస్తుంది. ఇక ఈ డైలాగులు, షార్ట్స్ చూస్తూ ఉంటే.. తప్పకుండా థియేటర్లో అభిమానులు హోరెత్తడం ఖాయంలా కనిపిస్తోంది. 

ఇక చేంజర్ సినిమా తెలుగులో బాలకృష్ణ డాకూ మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము సినిమాలతో పోటీపడిల్సి ఉంది. మరి ఈ మూడు సినిమాలలో.. ఏ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర.. భారీ విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా..బాలకృష్ణ డాకూ మహారాజ్ ట్రైలర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము ట్రైలర్ ఇంకా విడుదల కావాల్సి ఉన్నాయి. మరి ఈ ట్రైలర్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. 

Also Read: KR Krishna: న్యూఇయర్‌ తొలిరోజే సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. షాక్‌లో హీరో నాని

Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News