Rakul Preet: ఆ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో తనదైన నటనా ప్రతిభతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul preet Singh ), లాక్ డౌన్ టైంలో వర్క్ అవుట్స్, ఫిట్‌నెస్‌తో తన అందాన్ని రెట్టింపు చేసుకునే పనిలో పడింది. ఐతే ఆమె ఫిట్‌నెస్‌కి తగ్గట్టుగానే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి బయోపిక్‌లో ( Karnam Malleswari biopic ) రకుల్ ప్రీత్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Last Updated : Aug 6, 2020, 11:13 PM IST
Rakul Preet: ఆ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో తనదైన నటనా ప్రతిభతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul preet Singh ), లాక్ డౌన్ టైంలో వర్క్ అవుట్స్, ఫిట్‌నెస్‌తో తన అందాన్ని రెట్టింపు చేసుకునే పనిలో పడింది. ఐతే ఆమె ఫిట్‌నెస్‌కి తగ్గట్టుగానే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి బయోపిక్‌లో ( Karnam Malleswari biopic ) రకుల్ ప్రీత్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Also read: Color Photo teaser: టీజర్‌‌కి సూపర్ రెస్పాన్స్

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరిసారిగా మన్మథుడు 2 మూవీలో నాగార్జున అక్కినేనితో కలిసి నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం, COVID-19 లాక్ డౌన్ సమయంలో ఇంట్లో తన కుటుంబంతో సరదాగా గడుపుతున్న రకుల్, చాలా మంది దర్శకుల కథలను వింటోంది. అలాగే ఆచి తూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటోంది. అలాగే ఇప్పుడు కరణం మల్లేశ్వరి బయోపిక్‌కు రకుల్ ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Also read: Anushka Sharma: విరాట్ కోహ్లీకి నచ్చని విషయం అదే

ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ పతక విజేత కరణం మల్లేశ్వరి జీవిత చరిత్రను బయోపిక్‌గా తీసేందుకు నిత్యా మీనన్ ( Nitya menon ), తాప్సీ పన్నూ ( Tapsee Pannu ) లకు కథ వినిపించినట్లు గతంలో పుకార్లు వచ్చాయి. ఐతే ఇప్పుడు ఈ కథ రకుల్ చేతికి వెళ్ళినట్టు సమాచారం. ఆమె కథ విన్న తరువాత ఎంతో ముగ్డురాలై దర్శకురాలు సంజన రెడ్డికి ఒకే చెప్పినట్టు సమాచారం. కాని, ఇప్పటివరకు రకుల్ వైపు నుంచి కాని, నిర్మాతల వైపు నుండి కాని దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఇది నిజమా లేక రూమరా అని తెలుసుకోవడానికి మనము వేచి చూడాల్సిందే. Also read: Somu Veerraju: చిరంజీవితో సోము వీర్రాజు భేటీ

కర్ణం మల్లేశ్వరి బయోపిక్‌ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించబోతుంది. అలాగే కోన వెంకట్ డైలాగ్స్‌ని రాయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రం భారతదేశానికి పతకం సాధించడం లేదా పద్మశ్రీతో ఆమెను సత్కరించడంపై మాత్రమే దృష్టి పెట్టదని ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇది ఆమె జీవిత ప్రయాణం గురించి, ఆమె విజయం వెనుక పడిన కష్టం, ఆమె మంచి గుర్తింపు ఎలా పొందిందనే అంశాల గురించి చూపించనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.

ఇదిలావుండగా, రకుల్ ప్రీత్ సింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయలాన్ మూవీలో శివకార్తికేయన్ హీరోతో కనిపించనున్నారు. అలాగే శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్‌తో కలిసి భారతీయుడు 2 లో కనిపించనుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా అమ్మడు అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. Also read:  టీవీ నటుడు సమీర్ మృతి.. స్పందించిన పోలీసులు

Trending News