Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఢంకీ డైరెక్టర్

Rajkumar Hirani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చెర్రీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢంకీ డైరెక్టర్ తో త్వరలో సినిమా చేయబోతున్నాడన్న వార్త నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 03:17 PM IST
Rajkumar Hirani: రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఢంకీ డైరెక్టర్

Ram Charan Bollywood Movie : గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్ త్వరలో 'డంకీ' డైరెక్టర్ రాజ్​కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాజ్​ కుమార్. ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్ నాకు చాలా బాగా తెలుసు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతానికైతే ఆయన సినిమా చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా ఆర్ఆర్ఆర్ లో చెర్రీ నటన అద్భుతమంటూ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. 

రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన నయా మూవీ. బాలీవుడ్‍ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డిసెంబరు 21న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీకి పోటీగా ప్రభాస్ సలార్ ఉండటంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. వీకెండ్ కావడంతో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

Also Read: Kurchi Madathapetti Full Song: సంక్రాంతికి ఊర మాస్.. కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ చూశారా..!

మరోవైపు రామచరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుం షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన ఎంజాయ్ చేస్తున్నాడు చెర్రీ. త్వరలో చిత్రీకరణలో పాల్గొన్నాడు. మరోవైపు చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశాడు. 

Also Read: Thalapathy Vijay: చెన్నై వ‌ర‌ద బాధితుల‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆర్థిక స‌హాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News