Aishwarya Second Marriage: సూపర్ స్టార్‌ కూతురు రెండో పెళ్లి.. ఇదే సాక్ష్యం!

హీరో ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్‌ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. డైరెక్షన్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య రజినీకాంత్‌ కొత్తగా మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు... 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 01:53 PM IST
Aishwarya Second Marriage: సూపర్ స్టార్‌ కూతురు రెండో పెళ్లి.. ఇదే సాక్ష్యం!

Aishwarya Rajinikanth Second Marriage: తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌ గత ఏడాది భర్త ధనుష్ నుండి విడిపోయిన విషయం తెల్సిందే. ధనుష్.. ఐశ్వర్య రజినీకాంత్ లు 18 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో కొనసాగారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెద్ద వారు అయ్యారు. 

అలాంటి సమయంలో ఇద్దరు విడిపోవడం తమిళ సినీ జనాలకు మాత్రమే కాకుండా మొత్తం సౌత్‌ ఇండియన్ సినీ ప్రేమికులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్‌ మీడియా ద్వారా తాము ఇద్దరం విడిపోతున్నాం అంటూ ప్రకటించడంతో అప్పటి వరకు పుకార్లు అనుకున్న వారు అంతా కూడా కన్ఫర్మ్‌ చేస్తున్నారు. ఇద్దరు విడిపోవడంకు కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. 

ఇప్పటికే అధికారికంగా విడాకులు కూడా వచ్చేశాయి. ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల టాలీవుడ్‌ లో కూడా ఆయన సినిమా వచ్చింది. మరో వైపు ఐశ్వర్య రజినీకాంత్ కూడా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకురాలిగా ఐశ్వర్య రజినీకాంత్ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్న ఈ సమయంలోనే ఆమె ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. 

కోలీవుడ్ కే చెందిన ఒక హీరోతో ఆమె ప్రేమలో ఉందని.. ఇద్దరు కలిసి పలు సార్లు పార్టీ ల్లో ఇంకా రిసార్ట్స్ లో కనిపించారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆ మధ్య ఓ రిసార్ట్‌ లో ఐశ్వర్య ఆయనతో కలిసి ఉండటాన్ని చాలా మంది చూశారట. దాంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే పుకార్లు పెరిగాయి. 

Also Read: 'నాని 30' ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా?

ఐశ్వర్య రజినీకాంత్‌ మళ్లీ ప్రేమలో పడ్డారు అనేందుకు రిసార్ట్‌ ఫోటోలు వీడియోలు సాక్ష్యం అంటూ కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం రజినీకాంత్‌ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటూ ఆ పుకార్లను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

మొత్తానికి ఐశ్వర్య రజినీకాంత్‌ ప్రస్తుతం సింగిల్ గా ఉన్నారు కనుక ఇలాంటి పుకార్లు ముందు ముందు కూడా చాలానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె తన విషయాన్ని స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ఐశ్వర్య రెండవ పెళ్లి విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంది అనేది మాత్రం ఆమె చెప్పాల్సి ఉంటుంది.

Also Read: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో పిచ్చెకించే ఆఫర్స్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ స్మార్ట్ ఫోన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News