Senapathi: యాక్షన్, సస్పెన్స్‌లతో అదిరిపోయిన రాజేంద్రప్రసాద్ 'సేనాపతి' ట్రైలర్

Rajendra Prasad's Senapathi Trailer: నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సేనాపతి'. విభిన్నమైన కథ, కథనాలతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2021, 01:40 PM IST
  • విడుదలైన రాజేంద్రప్రసాద్ సేనాపతి ట్రైలర్
  • ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్‌లతో ఆకట్టుకున్న ట్రైలర్
  • విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న రాజేంద్రప్రసాద్
Senapathi: యాక్షన్, సస్పెన్స్‌లతో అదిరిపోయిన రాజేంద్రప్రసాద్ 'సేనాపతి' ట్రైలర్

Rajendra Prasad's Senapathi Trailer: నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సేనాపతి'. విభిన్నమైన కథ, కథనాలతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా (Senapathi) తెరకెక్కుతోంది. తాజాగా సేనాపతి ట్రైలర్‌ను (Senapathi Trailer) చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్ ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్ ఫీల్ కలిగించేలా ఉంది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) పాత్ర తీరు తెన్నులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్ ఓవర్‌లో ఒగ్గు కథ స్పెషల్ అట్రాక్షన్‌ అని చెప్పాలి. ఆ ఒగ్గు కథ ద్వారానే సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశారు.

2017లో తమిళంలో వచ్చిన '8 తొట్టక్కల్' (8 Thottakkal) సినిమాకు రీమేక్‌గా 'సేనాపతి' తెరకెక్కుతోంది. ప్రేమ ఇష్క్ కాద‌ల్‌ ఫేమ్ డైరెక్టర్ పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆహా ఓటీటీలో (Aha Originals) రిలీజ్ అవనున్న ఈ సినిమాలో హ‌ర్షవ‌ర్దన్‌, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, నరేష్ అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సేనాపతి మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Also Read: Snake hulchul: ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్లో రక్తపింజర కలకలం-భయంకరంగా బుసలు కొట్టిన పాము

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News