Rajasekhar: జీవిత చెప్తే నేను కాదు.. నేను చెప్తే తను ఆడుతుంది.. ట్రోలర్స్‌కు రాజశేఖర్ కౌంటర్

Rajasekhar: యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. అప్పట్లో ఆయన సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు నితిన్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న రాజశేఖర్ తన భార్య జీవితా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2023, 12:10 PM IST
Rajasekhar: జీవిత చెప్తే నేను కాదు.. నేను చెప్తే తను ఆడుతుంది.. ట్రోలర్స్‌కు రాజశేఖర్ కౌంటర్

Extra-ordinary Man pre-release event: హీరో రాజశేఖర్ పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరో పేరు జీవిత. జీవితన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రాజశేఖర్ ఎక్కడికి వచ్చినా ఆమెతోనే రావటం వల్ల అలానే రాజశేఖర్ కన్నా కూడా జీవిత మీడియా ముందు ఎక్కువ మాట్లాడటం వల్ల.. జీవిత చెబితే రాజశేఖర్ సరే అంటాడు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వేసేవారు. అయితే చాలామంది వీటికి పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యేవారు. ఎందుకంటే భార్యని అంతగా ప్రేమించే భర్త ఉండడం కూడా చాలా గొప్ప విషయం అని. భార్యని ఎలా చూసుకోవాలో రాజశేఖర్ ని చూసి నేర్చుకోవాలి అని కూడా ఎంతోమంది పోస్టులు వేసేవాళ్ళు. మొత్తానికి ప్రశంసలు వలలో విమర్శలు వల్ల వీరిద్దరి జంట మాత్రం ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చర్చగా కొనసాగుతూ ఉండింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్ నితిన్ సినిమా ఎక్స్ట్రార్ధనారీ మ్యాన్ లో చెప్పిన ఒక డైలాగ్ అందరినీ చాలా ఆకట్టుకుంది. నాకు జీవిత.. జీవితం ఒకటే అని ఫన్నీగా చెప్పే ఆ డైలాగ్ తెగ వైరల్ అయింది. నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్ల గా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ నెల 8వ తేదీన విడుదలవుతున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్. ఈ మూవీలో మొదటి సారిగా రాజశేఖర్ ఓ స్పెషల్ అప్పియరెన్స్ పాత్ర చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రం మీద అందరి ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరగక అందులో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్.

రాజశేఖర్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రంలో బాగా పాపులర్ అయిన డైలాగ్ జీవిత, జీవితం గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమాలోని డైలాగ్ గురించి ప్రస్తావించాడు. జీవిత,జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ స్పాట్‌లో రాశారు.. అది అంత క్లిక్ అవుతుందని మేము అనుకోలేదు. కాగా వక్కంతం వంశీ గారు నాకు కథ చెప్పారు.. బాగా నచ్చింది.. నాకు బాగా నచ్చడంతోనే ఈ పాత్రను చేశాను.. ఎలా ఉంటుందో ఆడియెన్స్ చూసి చెప్పాలి..’ అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత జీవిత గురించి మాట్లాడుతూ..’జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను.. జీవిత చెప్తే నేను ఆడతాను అని అందరూ అనుకుంటారు. అయితే నిజంగా జరిగేది మాత్రం అది కాదు. నేను ఏం చేస్తే జీవిత అలా ఆడుతుంది.. కానీ జీవిత చెప్పింది కూడా నేను వింటాను.. ఎందుకంటే ఆమె చెప్పేది నా మంచి గురించే. నాకు ఈచిత్రంలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ముఖ్యంగా హీరో నితిన్‌ను బయట చూసి ఆకతాయి అనుకున్నా.. సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు కదా? అందుకే అలా అనుకున్న కానీ సెట్స్‌లో హీరోగా, నిర్మాతగా అన్నీ ఎంతో బాధ్యతతో చూసుకున్నాడు.. శ్రీలీల, నేను ఇద్దరం ఎంబీబీఎస్ చదివాం.. అయితే  శ్రీలీల ఒక కండీషన్ పెట్టింది.. డాక్టర్ చదువు గురించి ప్రశ్నలు వేయద్దు అని అన్నారు.. అందుకే నేను వాటి గురించి మాట్లాడలేదు.. సినిమాను చూసి ఎలా ఉందో చెప్పండి' అంటూ చెప్పుకొచ్చాడు రాజశేఖర్.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News