Rajamouli's Shocking Reply to Karan Johar: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో ఈ సినిమా ఇటీవల కాలంలో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ప్రపంచం నలుమూలల నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ స్టార్స్ కి, దర్శకుడు రాజమౌళి భరీ ఎత్తున ప్రశంసలు లభిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ మూవీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందంటూ సినిమా కోసం.. ప్రత్యేకించి నాటు నాటు సాంగ్ ని తెరకెక్కించేందుకు కృషి చేసిన వారు తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటుండటం కూడా ఈ సినిమా వార్తల్లో నిలిచేందుకు మరో కారణమైంది.
ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన గత జ్ఞాపకాలు, మూవీ యూనిట్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎస్ఎస్ రాజమౌళికి, ప్రముఖ హిందీ నిర్మాత, ఫిలింమేకర్, ఫేమస్ హోస్ట్ కరణ్ జోహర్ కి మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రాజమౌళి, కరణ్ జోహర్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణే ఈ వీడియో అంత వైరల్ అయ్యేందుకు కారణమైంది. రాజమౌళితో కరణ్ జోహర్ మాట్లాడుతూ.. " మీ గత రెండు చిత్రాలైన బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ సినిమాలను హిందీలో నేనే ప్రజెంట్ చేశాను. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ రైట్స్ మాత్రం నాకు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారు. తనకు ఎందుకు ఇవ్వలేదో కారణం తెలుసుకోవచ్చా " అని అడిగారు.
అందుకు రాజమౌళి స్పందిస్తూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 చిత్రాలను హిందీలో ప్రజెంట్ చేసి మీరు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. తన చిత్రం అంత భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టినప్పుడు దర్శకుడిగా తనకు కూడా ఏమైనా గిఫ్ట్ ఇస్తారని ఆశించాను. కానీ మీరు నాకేం ఇచ్చారు అని ఎదురు ప్రశ్నించారు. అంతటితో ఊరుకోని రాజమౌళి... వందల కోట్లు లాభం సంపాదించుకున్న మీరు నాకేమీ ఇవ్వకపోగా.. మీ టాక్ షోకి పిలిపించి ఒక ఫోన్, బ్లూటూత్ స్పీకర్ ఇచ్చి పంపించారు. అందుకే ఈసారి ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ రైట్స్ మీకు ఇవ్వలేదు అంటూ కరణ్ జోహర్ ముఖం మీదే ఘాటైన సమాధానం ఇచ్చారు. రాజమౌళి చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టడం కరణ్ జోహర్ వంతయ్యింది.
ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?
ఇది కూడా చదవండి : iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్
ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook