Anand Mahindra Suggestion to Rajamouli పురాతన నాగరికతలైన సింధు, హరప్పా, మొహంజదారో వంటి వాటి మీద సినిమాలు తీయండి అంటూ రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సలహా ఇచ్చాడు. దీనిపై రాజమౌళి కూడా స్పందించాడు. తాను మగధీర సినిమాను ధోళావీరలో తీస్తున్న సమయంలో ఓ పురాతన చెట్టు కనిపించింది.. అది శిలాజంగా మారింది. సింధు నాగరికతను ఆ చెట్టు ద్వారా వివరిస్తూ ఓ సినిమా తీయాలని అనుకున్నాను.. ఆ తరువాత కొన్నేళ్ల తరువాత పాకిస్థాన్ వెళ్లాను.. మొహంజదారోను చూడాలని ప్రయత్నించాను.. కానీ పర్మిషన్ దొరకలేదు.. లోపలకు వెళ్లనివ్వలేదు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఆనంద్ మహీంద్రా ప్రాజెక్ట్ కే సినిమా కోసం చాలానే సాయం చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కే విషయంలో నాగ్ అశ్విన్ ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం తన ఇంజనీరింగ్ హెడ్‌లను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కార్లను, కార్ల టైర్లను కూడా కొత్తగా ప్రిపేర్ చేయించుకుంటున్నాడు నాగ్ అశ్విన్. అలా ఆనంద్ మహీంద్రా ఇప్పుడు సినిమా విషయాల మీద ఎక్కువగా స్పందిస్తున్నాడు.
Yes sir… While shooting for Magadheera in Dholavira, I saw a tree so ancient that It turned into a fossil. Thought of a film on the rise and fall of Indus valley civilization, narrated by that tree!!
Visited Pakistan few years later. Tried so hard to visit Mohenjodaro. Sadly,… https://t.co/j0PFLMSjEi
— rajamouli ss (@ssrajamouli) April 30, 2023
ఆర్ఆర్ఆర్ సినిమాపైనా ఆనంద్ మహీంద్రా ట్వీట్లు వేశాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు రాజమౌళికే ఇలా పురాతన నాగరికతల మీద సినిమా తీయమని సలహా ఇచ్చాడు. వీటి మీద సినిమాలు తీసి.. ప్రపంచానికి వాటి ఉనికి గురించి చెప్పండి అంటూ ట్వీట్ వేశాడు. దానికి రిప్లై ఇచ్చిన రాజమౌళి.. నాడు పాకిస్థాన్‌లో తనకు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని బయటపెట్టేశాడు.
Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసేందుకు కథను వండే బిజీలో ఉన్నాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ కథను రెడీ చేస్తున్నాడు. ఇక రాజమౌళి ఇన్ పుట్స్ కూడా అందులో ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఫ్యామిలీ అంతా కూడా ఈ కథారచన, చర్చల్లో భాగస్వామ్యం వహిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే కథ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. అందరి సలహాలను తీసుకుని కథను ప్రిపేర్ చేయడంతోనే అంత పకడ్బంధీగా సెట్ అవుతుంది.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook