Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??

ప్రభాస్​-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే కలెక్షన్ల పరంగా చూస్తే..తెలంగాణలో మాత్రం ఈ చిత్రం పుష్ప, భీమ్లానాయక్‌  సినిమాల‌ను దాట‌లేక‌పోయింద‌నేది ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 04:54 PM IST
  • తొలి రోజే రూ.79 కోట్ల వసూళ్లు
  • అంచనాలను చేరుకోలేకపోయిన రాధేశ్యామ్
  • ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా థియేటర్లలో రాధేశ్యామ్
Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??

Radheshyam movie Couldnt Cross Pushpa and Bhimlanayaks Collections: బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ ద‌క్కించుకున్న ప్ర‌భాస్ త‌ర్వాత సాహో సినిమాతో ప్రేక్ష‌కుల్లోకి సునామీల దూసుకెళ్లాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్​-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే కలెక్షన్ల పరంగా చూస్తే..తెలంగాణలో మాత్రం ఈ చిత్రం పుష్ప, భీమ్లానాయక్‌  సినిమాల‌ను దాట‌లేక‌పోయింద‌నేది ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

ప్రభాస్​-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్​ అవ్వాగా.. కలెక్షన్ల పరంగా తొలి రోజు మంచి వసూళ్లను అందుకుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్ ప్రభావంతో రెండు సార్లు వాయిదా పడిన రాధేశ్యామ్ మూవీ చివరికి విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలి రోజే రూ.79 కోట్లు వసూళ్లు నమోదు చేసుకుంది. ఇటివలే భారీ బడ్జెట్‌తో రిలీజ్‌ అయిన పుష్ప, భీమ్లానాయక్‌ సినిమాల కలెక్షన్లతో పోలిస్తే రాధేశ్యామ్‌ సినిమాకు తొలిరోజు వచ్చిన కలెక్షన్లే ఎక్కువ అని అంటున్నారు.

పుష్ప సినిమా తొలిరోజు రాబడికన్నా రాధేశ్యామ్‌ ఏకంగా 29 కోట్లు అధికంగా రాబట్టింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా 50 కోట్లు  సాధించింది. పుష్ప హిందీలో కలెక్షన్స్ విషయానికి వస్తే  రిలీజైన నాటినుంచి ఇప్పటిదాకా మొత్తం 3.05 కోట్లు కలెక్ట్ చేసిందన్న టాక్‌ వినిపిస్తోంది. కానీ, రాధేశ్యామ్ మాత్రం ఒక్క మొదటిరోజే హిందీలో 2 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టడంపై విశేషంగా చర్చ జరుగుతోంది. ఇటు.. తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్‌ సినిమా తొలిరోజు కలెక్షన్లు రూ.30 కోట్లుగా సినీ బృందం తెలిపింది. రికార్డు స్థాయిలో తెలంగాణలోనే రూ.11 కోట్లు అందుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.రాధే శ్యామ్​ మూవీ శాటిలైట్​ రైట్స్‌ను రూ.100 కోట్లకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ రైట్స్‌పై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ రైట్స్​ కూడా భారీ రేటుకు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో UV క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. 

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ ద‌క్కించుకున్న ప్ర‌భాస్ త‌ర్వాత సాహో సినిమాతో ప్రేక్ష‌కుల్లోకి సునామీల దూసుకెళ్లాడు. అయితే రాధే శ్యామ్​ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందించినప్పటికీ ప్రేక్షకులను మాత్రం అలరించలేక పోయిందని సమాచారం. పీరియాడిక్ ప్రేమ చిత్రంగా వచ్చిన ఈ రాధే శ్యామ్, అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా.. పుష్ప, భీమ్లానాయక్‌  సినిమాల‌ను దాట‌లేక‌పోయింద‌నేది ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. 3 వంద‌ల కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ సెట్స్‌తో ఇట‌లీ, రోమ్‌, జార్జియా వంటి దేశాల్లో ఈ సినిమాను చిత్రీక‌రించారు. మ‌నోజ్ ప‌ర‌మ హంస సినిమాటోగ్ర‌ఫీ, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ వేసిన భారీ సెట్స్ ఇవ‌న్నీ సినిమాకు మంచి అవుట్‌ పుట్‌నిచ్చాయి.

Also Read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..

Also Read: Polavaram Project: పోలవరంలో కీలక ఘట్టం.. ప్రాజెక్టు గేట్లు అమరిక పూర్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News