Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!

Radhe Shyam Trailer: ప్రభాస్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్‌’ మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా మార్చి 11న విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 03:38 PM IST
    • డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
    • రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్
    • మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న చిత్రం
Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!

Radhe Shyam Trailer: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా రెండో ట్రైలర్ వచ్చేసింది. మార్చి 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. వింటేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్‌‌లో ఉంది. పూజా హేగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ సినిమాకు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాయి. 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా ఆంక్షలు కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను మార్చి 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.  

Also Read: ET Telugu Official Trailer: సూర్య ET ట్రైలర్ రిలీజ్.. రాక్ సాలిడ్ గా ఉందన్న విజయ్ దేవరకొండ!

Also Read: Ghani Movie Release Date: వరుణ్ తేజ్ గని మూవీ విడుదల తేది ఫిక్స్.. ఈసారి పక్కా రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News