ఆర్జీవీ తీసే "లక్ష్మీస్ ఎన్టీఆర్"కి నిర్మాత ఎవరు..?

Last Updated : Oct 7, 2017, 08:11 PM IST
ఆర్జీవీ తీసే "లక్ష్మీస్ ఎన్టీఆర్"కి నిర్మాత ఎవరు..?

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు బయోపిక్ "లక్ష్మీస్ ఎన్టీఆర్"కి వైఎస్సార్‌సీపీ నాయకుడు  పి.రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించ బోతున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. "నా దర్శకత్వంలో వస్తున్న "లక్ష్మి'స్ యన్ టి ఆర్" చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని" అని పోస్టు చేశారు వర్మ. అలాగే ఆ నిర్మాతతో కలిసి దిగిన ఫోటో కూడా  ట్విటర్‌లో పోస్టు చేశారు వర్మ . 

Trending News