ప్రియాంక చోప్రా "హాట్ కిస్" ఫోటో వైరల్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటికో-3 అనే టీవీ సిరీస్‌లో నటిస్తోందన్న విషయం మనకు తెలిసిందే.

Last Updated : Jan 20, 2018, 01:12 PM IST
ప్రియాంక చోప్రా "హాట్ కిస్" ఫోటో వైరల్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటికో-3 అనే టీవీ సిరీస్‌లో నటిస్తోందన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఆమె ఆ టీవీ సిరీస్ షూటింగ్‌లో భాగంగా తన సహనటుడు అలన్ పావల్‌ను ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ ముద్దు ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేయడం గమనార్హం.ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో క్వాంటికో సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రియాంక చోప్రాను ఇటీవలే ప్రపంచంలోనే సెక్సీయస్ట్ ఆసియన్ అందగత్తెగా ఈస్టర్న్ ఐ సంస్థ ప్రకటించింది. అలాగే ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళలలో ఒకరిగా కూడా స్థానాన్ని కైవసం చేసుకుంది. 

Trending News