Priyadarshi : ఉన్నదంతా ఇచ్చేసి వెళ్లిపోయింది.. అత్తను తలుచుకుంటూ ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్

Priyadarshi Mother in law ప్రియదర్శి తన బలగం సినిమా సక్సెస్‌ను తన అత్త గారైన మంజు శర్మకు అంకితం చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె మరణించినట్టుగా చెప్పుకొచ్చాడు. అందుకే ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 03:44 PM IST
  • బలగం సినిమాతో వార్తల్లో ప్రియదర్శి
  • అత్త గురించి చెబుతూ ఎమోషనల్
  • కవిత చెప్పిన హీరో ప్రియదర్శి
Priyadarshi : ఉన్నదంతా ఇచ్చేసి వెళ్లిపోయింది.. అత్తను తలుచుకుంటూ ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్

Priyadarshi Mother in law బలగం సినిమాతో ప్రియదర్శి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రియదర్శి నటించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ కూడా హిట్ అవుతున్నాయి. లూజర్ వెబ్ సిరీస్ బాగానే ఆడింది. హీరోగా చేసిన మల్లేశం, బలగం సినిమాలు హిట్టుగా నిలిచాయి. జాతి రత్నాలు సినిమా అయితే ట్రెండ్ క్రియేట్ చేసింది. నవ్వించే పాత్రలైనా, ఏడిపించే కారెక్టర్లైనా కూడా ప్రియదర్శి అవలీలగా చేసేస్తుంటాడు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన బలగం సినిమాతో ట్రెండ్ అవుతున్నాడు.

ఈ బలగం సక్సెస్‌ను తన అత్తగారికి అంకితం చేసినట్టుగా ఇది వరకే ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన అత్తను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె ఎంతో శక్తివంతమైన మహిళ, ఎంతో ప్రేమతో మెలిగేది.. తన కుటుంబానికి తన వద్ద ఉన్నదంతా ఇచ్చేసి వెళ్లిపోయింది.. ఆమె నిజమైన హీరో.. పై నుంచి ఆమె మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. మా రూపంలో ఆమె వారసత్వం ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. 

ఈ రోజు, నేను ఆమెను ప్రేమతో గర్వంగా గుర్తుంచుకుంటాను. ఎప్పుడూ వెనుకంజ వేయని స్త్రీగా నిలిచారు. తాను వెనక ఉంటూ.. అందరినీ ముందు నిల్చోపెట్టే వ్యక్తిత్వం కలవారు.. తనకు తానే ఒక ఉదాహరణ నిలవగలిగే గొప్ప వ్యక్తి. ఆమె పెద్ద కూతురు ప్రాచీ శర్మ ఓ అడుగు ముందుకు వేసింది. తల్లి గొప్పదనం ముందు తరాలకు తెలియజేసేలా ఇలా బుక్ రెడీ చేసింది. అందులో సింపుల్‌గా ఇలా అమ్మ ప్రేమను కబీర్ దాస్ పద్యాన్ని గుర్తు చేసింది.

 

భూమి మొత్తాన్ని పేపర్‌గా చేసినా, అడవులన్నింటిని పెన్నుగా మలిచినా, నీటినంతటినీ ఇంక్‌గా మార్చినా, నీ గొప్పదనం గురించి మాటల్లో చెప్పలేను, రాయలేను, వర్ణించలేను అమ్మా. ఈ బుక్ అమెజాన్‌లో ఉందని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అయితే బలగం సక్సెస్‌ను ప్రియదర్శి ఎంజాయ్ చేస్తున్నాడు. RC 15 సెట్‌లో బలగం టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. శంకర్, రామ్ చరణ్‌ వంటి వారు బలగం టీంను అభినందించారు.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News