Priya Varrier Bikini : బికినీలో ప్రియా వారియర్.. బీచ్‌లో అలా విహరిస్తూ.. పిక్స్ వైరల్

Priya Prakash Varrier Bikini ప్రియా ప్రకాష్‌ వారియర్ తాజాగా మాల్దీవుల్లో మంటలు పుట్టించేస్తోంది. ప్రియా వారియర్ బికినీలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆమె అలా బీచుల వెంట నడుస్తూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 05:49 PM IST
  • నెట్టింట్లో ప్రియా వారియర్ మంటలు
  • మాల్దీవుల్లో బికినీతో ప్రియా హల్చల్
  • కన్నుగీటిన భామ అందాల ఆరబోత
Priya Varrier Bikini : బికినీలో ప్రియా వారియర్.. బీచ్‌లో అలా విహరిస్తూ.. పిక్స్ వైరల్

Priya Prakash Varrier Bikini ఒరు అదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) అంటూ వచ్చిన సినిమాతో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల కంటే ముందుగా వదిలిన చిన్న ప్రమోషనల్ వీడియోతో ప్రియా వారియర్ ఫేమస్ అయింది. కన్ను గీటి, ముద్దు గన్ను పేల్చి కుర్రకారును కట్టి పడేసింది. ప్రియా వారియర్‌కు వచ్చిన క్రేజ్‌తో సినిమా కథను కూడా మార్చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రియా వారియర్‌పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది.

సినిమా విడుదలకు ముందు ఆకాశన్నంటే క్రేజ్‌లో ప్రియా వారియర్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఆమె పాతాళంలోకి పడిపోయింది. అప్పటి వరకు క్యూ కట్టిన మేకర్లంతా కూడా ఆమెకు వెన్ను చూపారు. ఆఫర్లన్ని ఎగిరిపోయాయి. వచ్చిన క్రేజ్ అంతా గాల్లో బుడగలా తయారైంది. ఇక దీంతో కొన్ని రోజులు ప్రియా వారియర్ బయటి ప్రపంచానికి కనిపించకుండా పోయింది.

 

ఆ తరువాత ఆమెకు నితిన్‌ పక్కన నటించే అవకాశం వచ్చింది. చెక్ సినిమాలో నితిన్‌కు జోడిగా నటించింది. రకుల్ ప్రీత్, ప్రియా వారియర్, నితిన్ కలిసి నటించిన చెక్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ ప్రియా వారియర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు సైతం బెడిసి కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేకుండా పోయింది.

Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్‌

చేతిలో సినిమాలు లేకపోయినా కూడా ప్రియా వారియర్ మాత్రం తన అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో పొట్టి బట్టలు ధరించి తన క్రేజ్‌ను కాపాడుకుంటోంది. బికినీలు, హాట్ ఫోటో షూట్లు అంటూ తన డిమాండ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. కానీ ప్రియా వారియర్‌కు మాత్రం తెలుగులో ఆఫర్లు రావడం లేదు. తాజాగా మాల్దీవుల్లోని బీచులో ఇలా బికినీ ధరిస్తూ విహరిస్తూ కనిపించింది. బ్లూ బికినీలో ప్రియా వారియర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News