Mahesh Babu Workout: జిమ్​లో చెమటోడిస్తున్న మహేశ్​.. ఆ సినిమా కోసమేనా..?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ జిమ్‌లో చెమడోడిస్తున్నారు. ఆయన మామూలుగా వర్కౌట్లు చేయట్లేదు. తాజాగా తన ఇన్ స్టాలో దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేశ్. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 07:24 AM IST
Mahesh Babu Workout: జిమ్​లో చెమటోడిస్తున్న మహేశ్​.. ఆ సినిమా కోసమేనా..?

Mahesh Babu gym Workout Video Viral: 47 సంవత్సరాల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా కనిపించడం సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కడికే సాధ్యం. మంచి డైట్ ఫాలో అవుతూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన బాడీ ఫిట్ నెస్ కు కారణంగా ఆయన చెబుతారు. తాజాగా మహేశ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు క్యాప్షన్ జోడిస్తూ.. ''శనివారం మెరుపులు..ఒక నిమిషం ల్యాండ్ మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటెల్ బెల్ స్వింగ్స్, ఒక నిమిషం స్కిల్ మిల్ రన్..మీరెన్ని సెట్స్ చేయగలరు'' అంటూ అభిమానులను ప్రశ్నించారు. ఈ వీడియోలో మహేశ్ జిమ్ లో ఉండే కొన్ని ఎక్విప్ మెంట్స్ తో ఒక్కో నిమిషం పాటు వర్కౌట్ చేస్తూ కనిపించారు. 

https://www.instagram.com/reel/CuJl1OGsXPq/?utm_source=ig_web_copy_link&...

ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీలో చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనంతరం మహేశ్ జక్కన్నతో కలిసి ఓ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్టు 9న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మూవీ పూర్తి కథను రెడీ చేయడానికి రాజమౌళికి మరో రెండు నెలలు పట్టనుందట. కథ పూర్తయిన తర్వాత మరోసారి మహేశ్ కు వినిపించనున్నారట జక్కన్న. ఈ మూవీ కోసమే మహేశ్ జిమ్ లో ఇంతలా కష్టపడుతున్నారని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు. 

Also Read: Spy Movie Total Collections: స్పై మూవీ కలెక్షన్స్ అదుర్స్.. నిఖిల్‌కి మళ్లీ పండగే

Also Read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News