Premalu success Meet:ఈ ఇయర్ ఫిబ్రవరి 9న రిలీజైన మలయాళ చిత్రం ప్రేమలు చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ఆడియన్స్ రెస్పాన్స్‌తో పాటు క్రిటిక్స్ నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్ అంశాలతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్బుతమని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..
మలయాళంలో ఫిబ్రవరి 9న ‘ప్రేమలు’ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు.. సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతుంది. మలయాళ సినిమా అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో జరిగింది. ఇక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ జరిగింది. 90 శాతం కథ హైదరాబాద్ లోనే పిక్చరైజ్ చేశారు. అక్కడ రిలీజైన ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. ఆ క్రమంలో నాతో మాట్లాడితే తెలంగాణలో నేను రిలీజ్ చేస్తానని చెప్పాను. గురువారం ప్రీమియర్ షోస్ వేస్తే ఒక్కో స్క్రీన్ యాడ్ చేసుకుంటూ వెళ్లాము. మొత్తం పది షోస్ వేశాం. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ నమోదు చేయబోతున్నట్టు ఇక్కడ ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే తెలుస్తోంది. ప్రేక్షకులు కోరుకునే ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. ఆదిత్య తెలుగులో డైలాగులను అద్భుతంగా రాశాడు. థియేటర్స్ లో సినిమాను అందరూ చూసి ఆదరించాలన్నారు.
ఎస్.ఎస్.కార్తికేయ మాట్లాడుతూ ‘
‘ప్రేమలు’ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిందని తెలియగానే వెంటనే ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్నాను. అక్కడి నిర్మాతలకు తెలుగు రిలీజ్ చేయాలనుకుంటున్నానని చెప్పగానే వెంటనే రైట్స్ అమ్మేసారు. ఈ సినిమా మెయిన్ కథంతా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే సినిమా. నేను మలయాళ నిర్మాతలను సంప్రదించగానే వారు నాకు ఇక్కడ రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిత్య ఈ సినిమా డైలాగ్స్ ను 7-8 రోజుల్లో రాసి డబ్బింగ్ పూర్తి చేసారు. అక్కడ నిర్మాతల సపోర్ట్ మరిచిపోలేనిది. వారికి స్పెషల్ థాంక్స్.
మాటల రచయత ఆదిత్య మాట్లాడుతూ..
‘ప్రేమలు’ సినిమా చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులతో పాటు యూత్ తమను తాను ఐడెంటిఫై చేసుకుంటారు. ప్రతీ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకనే అలాంటి డైలాగ్స్ రాయాలనిపించి రాశాను. ఈ టీమ్ తో కలిసి పని చేయటం ఫుల్ హ్యాపీగా ఉంది. చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్. మీ గ్యాంగ్ తో కలసి ఈ మూవీని చూడండన్నారు. రోలర్ కోస్టర్ రైడ్ లా సినిమా ఆకట్టుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి