Spirit: ప్రభాస్ సరసన స్పిరిట్ లో స్టార్ హీరోయిన్.. సందీప్ రెడ్డి వంగా మార్క్ రిపీట్ కానుందా!

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ వంగ డైరెక్షన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా స్పిరిట్. ప్రభాస్, సందీప్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2024, 10:59 AM IST
Spirit: ప్రభాస్ సరసన స్పిరిట్ లో స్టార్ హీరోయిన్.. సందీప్ రెడ్డి వంగా మార్క్ రిపీట్ కానుందా!

Prabhas :

ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమాతో బాలీవుడ్ ని మాత్రమే కాక టాలీవుడ్ ని కూడా షేక్ చేసిన డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాజాగా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

స్పిరిట్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్, ప్రభాస్ ల క్రేజీ కాంబినేషన్ ను వెండితెరపై చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించేందుకు కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అని పుకార్లు వినిపించాయి. తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. కానీ తాజాగా ఇప్పుడు ఆమె స్థానంలో కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. 

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే కీర్తి సురేష్ కి ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే అది ఆమె కెరియర్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రభాస్, కీర్తి సురేష్ లు కలిసి నటించలేదు. కాబట్టి వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెర మీద ఫ్రెష్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. 

మరో పక్క కీర్తి అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కీర్తి సురేష్ బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించలేదు. కానీ సందీప్ రెడ్డి వంగ సినిమాలలో హీరోయిన్ అంటే తప్పకుండా ఆ క్యారెక్టర్ కి విమర్శలు వచ్చి తీరుతాయి. ఈమధ్య యానిమల్ లో రష్మిక క్యారెక్టర్ ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో కీర్తి సురేష్ క్యారెక్టర్ కూడా అలానే తీసి విమర్శల పాలు చేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాప్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లనుంది.

Also Read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక

Also Read: KTR Fire: కేకే, కడియం వంటి వాళ్లు మళ్లీ వచ్చి కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం: కేటీఆర్‌

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News