Radhe Shyam: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్ పై 'రాధేశ్యామ్' స్పెషల్‌ షోస్‌..అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

Radhe Shyam Movie: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌గా పేరొందిన మెల్‌బోర్న్‌ ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ప్రదర్శించబోతున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 07:32 PM IST
Radhe Shyam: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్ పై 'రాధేశ్యామ్' స్పెషల్‌ షోస్‌..అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..

Radhe Shyam Movie: ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'(Radhe Shyam Movie). పూజాహెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటించగా...‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే  రాధేశ్యామ్‌’ సినిమా కోసం ఆస్ట్రేలియా(Australia)లో స్పెషల్‌ షోలు వేయనున్నారు. అది కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్(Largest IMAX Screen)గా గుర్తింపు తెచ్చుకున్న మెల్‌బోర్న్‌ నగరంలోని ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై. 

మెల్‌బోర్న్‌లో 105*75 అడుగులున్న ఈ ఐమ్యాక్స్‌ థియేటర్‌ కొద్ది కాలం క్రితం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌గా ఉండేది. అయితే జర్మనీలో 144*75 ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌ ఏర్పాటుకావడంతో మెల్‌బోర్న్‌ ఐమ్యాక్స్‌ రెండో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడీ ఈ భారీ తెరపైనే ‘రాధేశ్యామ్‌’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. జనవరి 14న ఉదయం 7.30 గంటలకు ‘రాధేశ్యామ్’ స్పెషల్‌ షో మొదలవుతుంది. యూవీ క్రియేషన్స్(UV Creations) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 

Also Read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సాంగ్ అప్డేట్.. 'రోర్ ఆఫ్ భీమ్' రిలీజ్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News