Prabhas wearing mask: కరోనావైరస్ ఎఫెక్ట్.. మాస్క్ ధరించిన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్!

ప్రభాస్ ఎయిర్ పోర్టులో మాస్క్ ధరించిన దృశ్యాలు, ఫోటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తర్వాతి చిత్రం 'రాధే శ్యామ్' నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూరప్ బయల్దేరిన ప్రభాస్.. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి వచ్చి ఇలా మాస్కుతో కనిపించాడు.

Last Updated : Mar 5, 2020, 11:20 AM IST
Prabhas wearing mask: కరోనావైరస్ ఎఫెక్ట్.. మాస్క్ ధరించిన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్!

ప్రభాస్ ఎయిర్ పోర్టులో మాస్క్ ధరించిన దృశ్యాలు, ఫోటోలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తర్వాతి చిత్రం 'రాధే శ్యామ్' (Radhe Shyam) నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూరప్ బయల్దేరిన ప్రభాస్.. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి వచ్చి ఇలా మాస్కుతో కనిపించాడు. విమానాశ్రయం పరిసరాలు అంటేనే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులు, వివిధ ఎయిర్ లైన్స్ సిబ్బంది తిరిగే ప్రాంతం కావడంతో ప్రభాస్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రభాస్ మాస్క్ ధరించిన ఫోటోలు (Prabhas mask wearing photos) చూస్తే అర్ధమవుతోంది. 

తప్పని ప్రయాణం:
రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ప్రభాస్ తాజాగా మరో షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లాడు. కొన్ని నెలల ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కావడం, ఈ షెడ్యూల్లో పాల్గొనే నటీనటులంతా మళ్లీ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ యూరప్ షెడ్యూల్‌ని రద్దు చేసుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజా హెగ్డెలపై పలు కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెల్స్, పాటలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. రాధాక్రిష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఆందోళనలో ప్రభాస్ అభిమానులు:
ఓవైపు యావత్ ప్రపంచదేశాలు కరోనావైరస్ భయంతో వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో.. అసలే చల్లటి ప్రాంతానికి వెళ్తున్న ప్రభాస్‌ని చూసి డార్లింగ్ ఫ్యాన్స్ (Prabhas`s fans) ఆందోళనకు గురవుతున్నారు. ''ప్రపంచదేశాలన్నీ కరోనావైరస్ కారణంగా తమ ఇంటర్నెషనల్ ఈవెంట్స్‌ని వాయిదా వేసుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం ఇప్పుడిలా సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లేంత రిస్క్ తీసుకోవడం అవసరమా'' అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Trending News