Spirit Movie: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్‌' సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్?

Spirit Movie: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. అతడి నుంచి సినిమా వస్తుందంటే దేశం మెుత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 02:29 PM IST
Spirit Movie: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్‌' సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్?

Spirit Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మూడు, నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు ప్రభాస్. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి.. రిలీజ్ కు రెడీ అయింది. మరోవైపు కల్కి మూవీ పార్ట్ 01 చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరోవైపు ప్రభాస్ సందీప్‌ రెడ్డితో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌(Spirit Movie) అని పేరు పెట్టారు. ఈ మూవీలో డార్లింగ్ పోలీస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

తాజాగా స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  త్వరలో ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రారంభించబోతున్నట్లు చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా యానిమల్‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబరు 01న విడుదల కానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న్నారు. 

ప్రభాస్ కు బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు. ఆ తర్వాత వచ్చిన సాహో నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకోగా.. సౌత్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అనంతరం వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఇక ఎన్నో విమర్శలు మధ్య ఈ ఏడాది రిలీజైన ఆదిపురుష్ భారీ ఓపెనింగ్ రాబట్టినప్పటికీ సినిమాపై నెగిటివిటీ పెరిగిపోవడంతో ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆశలన్నీ సలార్, కల్కిపైనే ఉన్నాయి.  ఈ చిత్రాల ద్వారానే హిట్ కొడతాడో లేదో చూడాలి. 

Also Read: Anand New Movie: ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమంత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News