Prabhas Health : ప్రభాస్‌కు విదేశాల్లో చికిత్స.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

Prabhas Health Checkup ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడని తెలుస్తోంది. ఇటలీకి వెళ్లింది ఏదో సినిమా షూటింగ్ కోసం అయితే కాదట. హెల్త్ చెకప్ కోసం ప్రభాస్ ఇటలీకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 03:28 PM IST
  • విదేశాల నుంచి వచ్చిన ప్రభాస్
  • హెల్త్ చెకప్ కోసం వెళ్లిన డార్లింగ్
  • షూటింగ్‌లతో బిజీగా ప్రభాస్
Prabhas Health : ప్రభాస్‌కు విదేశాల్లో చికిత్స.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

Prabhas Health Checkup డార్లింగ్ ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకరకంగా వైరల్ అవుతూనే ఉంటాయి. సలార్ సినిమా షూటింగ్ సమయంలోనూ గాయపడ్డాడని రూమర్లు వచ్చాయి. మారుతి సినిమా షూటింగ్ సమయంలోనూ అలానే జరిగిందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాల్సి ఉండగా.. ప్రభాస్ హెల్త్ సమస్యల వల్లే ఆలస్యమైందని రూమర్లు వచ్చాయి. అయితే గత నెలలో ప్రభాస్ ఆరోగ్య మీద లెక్కలేనన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇక ప్రభాస్‌కు జ్వరం వచ్చిందని ఒకరు.. హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉందని ఇంకొందరు నానా రకాలుగా రూమర్లు వచ్చాయి. అయితే ప్రభాస్‌కు మాత్రం హెల్త్ కాస్త సీరియస్‌గానే ఉందని, విదేశీ వైద్యుల సమక్షంలోనే చికిత్స జరిగిందనే టాక్ బయటకు వచ్చింది. జ్వరం కాదని, కాస్త సీరియస్‌గానే ఉందని ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయింది.

అయితే ప్రభాస్ మాత్రం ఇటలీలో చికిత్స తీసుకున్నాడని, హెల్త్ చెకప్ కోసమే ప్రభాస్ ఇటలీకి వెళ్లాడని తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ ఇండియాలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టడమే కాకుండా షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌ హెల్త్ అంతా ఓకే అయిందని, వరుసగా షూటింగ్‌లు కానిచ్చేస్తాడని టాక్.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్, మారుతి సినిమాలున్నాయి. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా షెడ్యూల్ కూడా స్టార్ అయింది. ప్రాజెక్ట్ కే అయితే ఎప్పటి నుంచో షూటింగ్ నడుస్తూ ఉంది. ఆదిపురుష్ ప్యాచ్ అప్ వర్క్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్ సినిమాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

ప్రభాస్ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు అయితే పెళ్లి గురించి రూమర్లు క్రియేట్ చేస్తుంటారు. కృతి సనన్‌తో ప్రేమ, పెళ్లి అని కొందరు.. కాదు కాదు అనుష్కతో ప్రేమ, పెళ్లి అని ఇంకొందరు రూమర్లు ప్రచారం చేస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే.

Also Read:  Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్

Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News